ఇదో ఫేక్ కేసు.. ఇదిగో ప్రూఫ్.. హైకోర్టులో కేటీఆర్ లాయర్ సంచలన వాదనలు!

హైకోర్టులో కేటీఆర్‌ తరఫున న్యాయవాది సుందరం తన వాదనలు వినిపించారు. కేటీఆర్‌ లబ్ధి పొందినట్లు FIRలో పొందుపర్చలేదని.. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని తెలిపారు. ఆయనపై పెట్టిన పీసి యాక్ట్ వర్తించదని పేర్కొన్నారు.

New Update
KTR HIGH COURT

హైకోర్టులో కేటీఆర్‌ తరఫున న్యాయవాది సుందరం తన వాదనలు వినిపించారు. కేటీఆర్‌ లబ్ధి పొందినట్లు FIRలో పొందుపర్చలేదని.. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని తెలిపారు. '' సీజన్‌ 9లో అగ్రిమెంట్ జరిగింది. సీజన్ 10కి అగ్రిమెంట్ అవసరం లేదు. అగ్రిమెంట్ జరిగాక 14 నెలలకు కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఏసీబీకి ఏం సంబంధం. కోడ్ ఉల్లంఘన జరిగితే ఈసీ చూసుకుంటుంది.

Also Read :  కేసీఆర్ సంచలన నిర్ణయం.. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి?

రేసు కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్‌పై కేసు ఎందుకు పెట్టారు. అసలు కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారు.గత ఏడాది సీసన్ 9 కార్ రెసింగ్ నిర్వహించారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25లోనే ఒప్పందం జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం జరిగింది. సీజన్ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చింది. సీసన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుంది. దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. పాత ఒప్పందానికి కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగింది. ఎన్నికల కోడ్ ఉల్లగించారనడానికి ఎలాంటి అధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదు అనడం సరైంది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా కేవలం రాజకీయ కక్ష్యాలతోనే ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి.అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a) సెక్షన్ దీనికి వర్తించదని'' లాయర్ సుందరం వాదనలు వినిపించారు.

Also Read :  హరీష్‌కు కొరడా దెబ్బలు తప్పవు.. కేటీఆర్‌ను అతనే ఇరికించాడు!

KTR Lawyer Sensational Comments

న్యాయవాది సుందరం తన వాదనలు వినిపించారు. 

Also Read :  మహారాష్ట్ర TO తెలంగాణ.. ఆ అడవుల్లో మరో రెండు పెద్ద పులుల అలజడి..!

మరోవైపు ఫార్ములా ఈ - కార్ రేసు విషయంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ కూడా స్పందించారు. '' ఫార్ములా - ఈ రేసు ద్వారా రూ.600 కోట్ల స్కాం చేయడానికి ప్లాన్ చేశారు. నేను గత డిసెంబర్‌లో FEOకు అపాయింట్‌మెంట్ ఇచ్చా. ఆయనతో ఫోటో కూడా తీసుకున్నా. ఇలా చాలా మందిని కలుస్తా, ఎవరొచ్చినా కలుస్తా. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌ నా దగ్గరే ఉన్నాయి. కోర్టు ప్రోసిండింగ్స్ తర్వాత నేను ఈ విషయంపై పూర్తిగా మాట్లాడతా. HMDA ఖాతాకు రావాల్సిన డబ్బులు లండన్‌కు ఎలా వెళ్లాయి. నగదు బదిలీ చేయాలంటే RBI అనుమతి ఉండాలి. ఈ అంశంపై చర్చించడానికి ఎక్కడికైనా వస్తానని రేవంత్ అన్నారు.   

Also Read :  తాగి అసెంబ్లీకి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వీడియో!

Advertisment
తాజా కథనాలు