రేవంత్ ఏం పీక్కుంటావో పీక్కో.. అరెస్టుపై కేటీఆర్ సంచలనం సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను, శాంతి భద్రతలను నియంత్రించండలో విఫలమైన ముఖ్యమంత్రి పనితనాన్ని దాచిపెట్టేందుకు పోలీసు వ్యవస్థ ఆయనకు ఒక ప్రైవేటు ఆర్మీలాగా పనిచేస్తోందని విమర్శించారు. By B Aravind 14 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ గ్రామంలో ఫార్మా కంపెనీని ఏర్పాటు చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు దాడి చేయడం దుమారం రేపుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకదానికొకటి తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను, శాంతి భద్రతలను నియంత్రించండలో విఫలమైన ముఖ్యమంత్రి పనితనాన్ని దాచిపెట్టేందుకు పోలీసు వ్యవస్థ సీఎం రేవంత్‌కు ఒక ప్రైవేటు ఆర్మీలాగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. Also Read: లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ! ఫార్మా కంపెనీకి, తన బంధువుకి ప్రయోజనం చేకూర్చేందుకు స్థానిక ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై తన సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత వచ్చిందన్నారు. దీనిపై ప్రజల నిరసనలు జరుగుతున్నాయని.. ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రతిఒక్కరి హక్కు అని పేర్కొన్నారు. మరోవైపు కొండంగల్ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. Also Read: వాట్సాప్‌ను నిషేధించాలని సుప్రీంకోర్టులో పిల్.. చివరికీ '' ఈ దాడి ఘటనపై మావోయిస్టులు కూడా స్పందించారు. కానీ హరగోపాల్, కోదండరాం కనీసం మాట్లాడడం లేదు. సురేష్ మా పార్టీ కార్యకర్త, అతనికి 7 ఎకరాల భూమి ఉంది. పక్కా చెప్తున్నా 4 సంవత్సరాల తర్వాత మళ్లీ మేమే వస్తాం. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టు బోగస్. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేసే ప్రసక్తే లేదు. నేషనల్ విమెన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం వరకు కూడా తీసుకెళ్తాం. నన్ను లోపల వేస్తే ఎన్ని రోజులు వేస్తారు. కొన్ని రోజుల తరువాత బయటికి వస్తా కదా. బయటకి వచ్చి మళ్ళీ ఇంకా గట్టిగా మాట్లాడుతా. నన్ను లోపలేస్తే మా పార్టీ ప్రజల కోసం ప్రజల కోసం కొట్లాడుతుందని'' కేటీఆర్ అన్నారు. #ktr #telugu-news #CM Revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి