తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ను కలిసిన కేటీఆర్

మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాలువతో కప్పి  సత్కరించి.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహుకరించారు.

New Update
ktr governor

తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాలువతో కప్పి  సత్కరించి.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహుకరించారు. ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఉన్నారు.

కేసీఆర్ కు తుంటి విరిగినప్పుడు

కాగా కేసీఆర్ కు తుంటి విరిగినప్పుడు మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్  రాష్ట్రం విడిపోయాక కూడా గవర్నర్ గా కొనసాగారు. 2014 నుంచి 2019 వరకు  రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు. మాజీ గవర్నర్ కృష్ణకాంత్‌ను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం పనిచేసిన గవర్నర్‌గా నిలిచారు నరసింహన్.

Also read :  KCR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు