/rtv/media/media_files/2025/08/04/raj-gopal-reddy-2025-08-04-09-48-07.jpg)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను అవమానించడం సరికాదని, అలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని ఆయన ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా కోమటి రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి పరోక్షంగా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. 2 రోజుల క్రితం నవ తెలంగాణ దినపత్రిక దశమ వార్షికోత్సవం సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులపై మండిపడ్డారు. డిజిటల్ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్షరాలు రాయడం రాని వారు కూడా జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పని చేసే జర్నలిస్టులపై ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వారిని దూరంపెట్టాలని మెయిన్ ట్రీమ్ మీడియాకు సూచించారు. ఆ వ్యాఖ్యలపై పరోక్షంగా ముఖ్యమంత్రికి రాజ్‌గోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా జర్నలిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2025
మరోసారి యూట్యూబ్ జర్నలిస్టుల మీద నోరుపారేసుకున్న రేవంత్ రెడ్డి
యూట్యూబ్ జర్నలిస్టులను చూస్తే చెంప పగలగొట్టాలని అనిపిస్తుంది - రేవంత్ రెడ్డి https://t.co/lRFarbUMgHpic.twitter.com/ENoH1DHSrv
ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు…
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) August 4, 2025
‘సోషల్ మీడియా జర్నలిస్టులని గౌరవించాలి’
ప్రజల కోసం పని చేస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టులను గౌరవించాలే తప్పా అవమానించడం సబబు కాదని Xలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు..‘ ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు. అని కోమటి రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్‌లో అసంతృప్తి గళం
రాజగోపాల్ రెడ్డి ట్వీట్‌తో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గత కొంతకాలంగా మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి, వీలైనప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియా జర్నలిస్టుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత కలహాలను మరోసారి బహిర్గతం చేశాయి.