/rtv/media/media_files/2025/11/12/election-2025-11-12-11-28-48.jpg)
దేశంలోనే తొలిసారిగాఎన్నికల్లో అక్రమాలను పర్యవేక్షించడానికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మోహరించిన ఆరు నిఘా డ్రోన్లను గుర్తుతెలియని దుండగులు గాలిపటాలను ఉపయోగించి కూల్చివేయడం సంచలనం సృష్టించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన మొత్తం 139 మంది లైసెన్స్ పొందిన డ్రోన్ పైలట్‌లను ఎన్నికల విధుల్లో నియమించారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని నాలుగు ప్రాంతాలలో రహమత్‌నగర్‌లో రెండు, కర్మికానగర్‌లో రెండు, మాధురానగర్, శేఖ్‌పేటలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు డ్రోన్లను గాలిపటాల ద్వారా ధ్వంసం చేశారని సమాచారం.
#Elections | A total of 139 licensed drone pilots from Telangana, Andhra Pradesh, and Tamil Nadu were assigned to oversee polling activitieshttps://t.co/mnCPd7byJA
— News18 (@CNNnews18) November 12, 2025
రూ. 2.5 లక్షల విలువైన ప్రతి డ్రోన్ గాలిలో ఉండగానే ధ్వంసమైంది. ఈ ఘటనతో మొత్తం ఆరు డ్రోన్లు కూలిపోగా, రూ. 15 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఒక్కో పైలట్‌కు రూ. 12,000 గౌరవ వేతనం చెల్లించగా, వారు పోలింగ్ కేంద్రాల చుట్టూ 3 కి.మీ. పరిధిలో నిఘా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ డ్రోన్లు మూడు బ్యాటరీలతో, నిరంతరంగా మూడు గంటల పాటు ఎగిరే సామర్థ్యం కలిగి ఉన్నాయి. డ్రోన్ల నుండి వచ్చే లైవ్ ఫీడ్‌లను కమాండ్ సెంటర్ ద్వారా అధికారులు పర్యవేక్షించారు. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు పైలట్ల నుండి డ్రోన్లను లాక్కోవడానికి ప్రయత్నించారని, ఆపరేటర్లను బెదిరించారని కూడా సమాచారం. ఈ క్రమంలో ఓటింగ్ లో ఏమైనా దొంగ ఓట్లు పడ్డాయా అనే అనుమానం నెలకొంది.
48.47% ఓటింగ్
ఇక ఈ ఉప ఎన్నికలో మొత్తం 48.47% ఓటింగ్ నమోదైంది.నవంబర్ 14న లెక్కింపు ఉంటుంది. పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన చాలా వరకు ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంచనా వేశాయి. చాలా సర్వేలు కాంగ్రెస్ పార్టీకే కొద్దిపాటి మొగ్గు చూపాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, కాంగ్రెస్ 3% నుండి 8% ఓట్ల తేడాతో గెలుపొందే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Follow Us