Telangana: నేడు, రేపు తెలంగాణలో వర్షాలు
తెలగు రాష్ట్రాల్లో ఇవాళ , రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. తెలంగాణ మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా జల్లులు కురుస్తాయని తెలిపింది.
తెలగు రాష్ట్రాల్లో ఇవాళ , రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. తెలంగాణ మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా జల్లులు కురుస్తాయని తెలిపింది.
ఖమ్మం కాంగ్రెస్లో వర్గ పోరు భగ్గుమంది. మహిళా నేతల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావ్ చేతిలో మైక్ లాక్కుని భట్టికి అనుకూలంగా సౌజన్య నినాదాలు చెప్పట్టారు. వర్గాలుగా విడిపోయి జై పొంగులేటి, జై తుమ్మల, జై భట్టి అంటూ నినాదాలు చేపట్టారు.
తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్.. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు వెళ్లనున్నారు.
ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ టికెట్ రేసులో భట్టి విక్రమార్క భార్య నందినితో పాటు మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. తమకే అధిష్టానం టికెట్ కేటాయిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుంటున్నారు. మరి వీరిలో ఎవరి టికెట్ వస్తుందో చూడాలి.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలోని మహిళలకు తీపి కబురు అందించారు. త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామాని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిగా చూసుకుంటాం అని పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. రాజీనామా చేసే ఆలోచనలో మరో నేత ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. పదిహేను రోజుల్లో పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు నమాచారం. వీరందరూ చాలా ఏళ్ళ క్రితమే అక్రమంగా ఇక్కడకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లా తర్వాత ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక డంప్ ఉన్నట్టు సమాచారం. దీన్ని తెలంగాణకు చెందిన కొందరు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ కనీసం వంద నుంచి 120 లారీల్లో ఇసుకను మన రాష్ట్రంలోకి తరలిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చిన్నపిల్లల కిడ్నాప్ వార్తలు సంచలనం రేపుతున్నాయి. స్కూల్ పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందున్నారు. కొత్తగా కనిపించిన వ్యక్తులను దాడులు చేస్తుండగా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అమాయకులను కొడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.