Telangana: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు..
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, . హైదరాబాద్ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసింది.
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, . హైదరాబాద్ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం రైతుభరోసా, పంటలభీమా, రుణమాఫీ పథకం అమలుపై కసరత్తును ప్రారంభించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతులను పంట రుణాలు రికవరీ కోసం ఇబ్బంది పెట్టొద్దని పరపతి సంఘాలు, బ్యాంకులను మంత్రి కోరారు.
తనకు ఖమ్మం ఎంపీగా అభ్యర్థిగా అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు తనను ఎంపీగా పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా తాను అక్కడ జరిగిన అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు.
పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం జిల్లా సరిహద్దు తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం చెక్ పోస్టు వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
భద్రాచలం దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150 ల టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
తెలంగాణలో 14 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఎంపీ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం- వెంకటేశ్వరరావు, కరీంనగర్- రాజేందర్, హైదరాబాద్- ఫిరోజ్ ఖాన్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి ప్లాన్ A అంటే పార్టీలో ఉంటే నా వెంట ఎంత మంది వస్తారు ? ప్లాన్ B అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి...సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంత మంది వస్తారు ? అని అన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కుట్ర జరుగుతోందన్నారు.
తాను అమ్ముడుపోలేదని.. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానని అంటున్నారు భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధుకు సిగ్గు, లజ్జ ఉంటే భద్రాచలంకు ఏంచేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని తేల్చిచెప్పారు.