Hijra Attack: ఖమ్మంలో హిజ్రాల వీరంగం.. నడి రోడ్డుపై..!

మధిర పట్టణంలో హిజ్రాలు రెచ్చిపోయారు. రాత్రి సమయంలో 12 మంది హిజ్రాలు డీసీఎం డ్రైవర్ పై దాడి చేశారు డ్రైవర్ వారిని అడ్డుకోలేక సైలెంట్ అయిపోయాడు. మద్యం మత్తులో వాహనదారులను ఆపి, డబ్బు వసూలు చేస్తున్నారు. డబ్బు ఇవ్వని వారిపై దాడి చేస్తున్నారు.

New Update
hijra

hijra attack

Hijra Attack: ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నడి రోడ్డుపై హిజ్రాలు వీరంగం సృష్టించారు. నిన్న దీపావళి రోజున రోడ్డు వెళ్తున్న డీసీఎంను ఆపి డ్రైవర్ పై విరుచుకుపడ్డారు. ఏకంగా 12 మంది డీసీఎం డ్రైవర్ పై దాడి చేశారు. డ్రైవర్ క్యాబిన్ పైకి  ఎక్కి బలవంతంగా బండి  తాళాలు తీసుకోవడానికి యత్నించారు. దీంతో డ్రైవర్ వారిని అడ్డుకోలేక సైలెంట్ అయిపోయారు. ఇదే అదునుగా భావించి డ్రైవర్ పై రెచ్చిపోయారు. మద్యం మత్తులో వాహనదారులను ఆపేసి దౌర్జన్యంగా పైసలు వసూలు చేశారు. ఇవ్వని వ్వనివారిపై పై  విధంగా దాడులకు తెగబడ్డారు. వీళ్ళ దౌర్జ్యన్ని చూస్తూ సామాన్యులు కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.  

Also Read: బిగ్ సెల్యూట్.. 'అమరన్' మూవీ పై CM ప్రశంసలు!

హైదరాబాద్ లో 

ఇక హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే.. బండ్లగూడ జాగీర్, గండిపేట్, రాజేంద్రనగర్, అత్తాపూర్ వంటి కొన్ని హిజ్రాల హంగామా అంతా ఇంత కాదు.. ఏదైనా ఫంక్షన్, ఈవెంట్ జరుగుతుందంటే చాలు పదుల సంఖ్యంలో వచ్చి.. డబ్బులు ఇవ్వాలని జనాలను ఇబ్బంది పెడుతుంటారు. అంతే కాదు ఇచ్చే డబ్బులకు  కూడా డిమాండ్ లు చేస్తూ హంగామా చేస్తారు. వీరి ఆగడాలను ఆపకుంటే ముందుముందు చాలా కష్టమని అంటున్నారు బాధితులు. అయితే ఇలాంటి ప్రాంతాల్లో హంగామా చేసే హిజ్రాలు లోకల్ వారు కాదని.. నార్త్ ఇండియా నుంచి వచ్చినవారిని అంటున్నారు.  

Also Read: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!

Also Read: బాలీవుడ్ లో రష్మిక హవా.. మరో ప్రాజెక్ట్ ఒకే చేసిన బ్యూటీ.. కొత్తగా టైటిల్

Also Read: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!

Advertisment
తాజా కథనాలు