Rashmika
Rashmika: నటి రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా దూసుకెళ్తోంది. ఓ వైపు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే..బాలీవుడ్ లోనూ హవా కొనసాగిస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటికే హిందీలో 'ఛావా', సికిందర్ సినిమాలు చేస్తున్న రష్మిక.. తాజాగా మరో ప్రాజెక్ట్ ఒకే చేసింది.
Also Read: బిగ్ సెల్యూట్.. 'అమరన్' మూవీ పై CM ప్రశంసలు!
కొత్త ప్రాజెక్ట్ 'థమా'
'థమా' అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం 'స్త్రీ', 'బేడియా', 'ముంజ్య' వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దినేష్ విజన్ మడాక్ ఫిల్మ్స్ యూనివర్స్ నుంచి రాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రష్మిక సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మోషన్ పోస్టర్ షేర్ చేసింది. "ఇప్పటి వరకు హారర్ సినిమాలు తెరకెక్కించిన దినేష్ విజన్ యూనివర్స్ ఒక ప్రేమ కథ కోరుకుంటుంది. దురదృష్టవశాత్తూ అది చాలా ఉద్వేగంతో కూడుకున్నది" అంటూ పోస్టర్ చేశారు. 'ముంజ్య' ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా.. ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు తెలిపారు.
Dinesh Vijan’s Horror Comedy Universe needed a love story... unfortunately, it's a bloody one. 💘
— Rashmika Mandanna (@iamRashmika) October 30, 2024
Brace yourselves for #Thama - Diwali 2025! 💥@ayushmannk #PareshRawal @Nawazuddin_S #DineshVijan @amarkaushik @AdityaSarpotdar @nirenbhatt @Suresh_Mathew_ #ArunFulara… pic.twitter.com/IvermO25F0
ప్రస్తుతం రష్మిక తెలుగులో 'కుబేర' సినిమా చేస్తోంది. శేఖర్ కముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరో ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్‌మోహన్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామాగా రూపొందుతున్న 'కుబేర' తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read: జిల్ జిల్ జిగేల్.. టాలీవుడ్ స్టార్లు దీపావళి విషెస్ ఎలా చెప్పారో చూడండి!