Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..తల్లి, కొడుకు ప్రాణాలు తీసిన కారు

ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు సైడున తాటి ముంజెలు కొంటున్న తల్లి, కొడుకుపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. 

New Update
ACCIDENT

ACCIDENT

నిర్లక్యం డ్రైవింగ్ తల్లి, కొడుకు ప్రాణాలను అన్యాయంగా తీసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడులో ఈ ఘటన జరిగింది. ఒక గుర్తు తెలియని కారు చాలా వేగంగా వచ్చి రోడ్డు పక్కన తాటి ముంజెలు కుంటువారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారేపల్లి మండలం జాస్తిపల్లికి చెందిన శారద(38), ఆమె కుమారుడు కార్తీక్‌ (13) అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి కూడా విపరీతంగా గాయపడ్డారు. అతనిని ఆసుపత్రిలో చేర్చిన డ్రైవర్ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ఎవరిది, యాక్సిడెంట్ ఎలా అయింది అనే దానిపై విచారణ చేస్తున్నారు. 

today-latest-news-in-telugu | car-accident | mother-and-son

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు