TG News: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి వాగులో పడిన ట్రాలీ.. 25 మంది!

భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 25 మంది వ్యవసాయ కూలీలతో వెళుతున్న టాటాఏసీ.. టైర్ పేలడంతో బ్రిడ్జి పైనుంచి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్రగాయాలవగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Bhadradhri Kothagudem district

Bhadradhri Kothagudem district

TG News:  ఖమ్మం భద్రాధ్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పెద్దవాగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 25 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటాఎసీ వాహనం వాగులోకి పడిపోయింది. టైర్ పేలడంతో అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి వాగులోకి పడిపోయినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్రగాయాలు అవగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: Ap Weather: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వానలే..వానలు!

మరో విషాదం.. 

ఇదిలా ఉంటే ఖమ్మంలో  మరో విషాదం చోటుచేసుకుంది. ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన సరోజమ్మకు ఈ నెల 20న ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నెహ్రూ నగర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు గుండె సమస్య ఉందని స్టెంట్ వేశారు. కానీ ఆ తర్వాత అనుకోని విధంగా ఆమెను మృత్యువు వెంటాడింది. ఆపరేషన్ అనంతరం లిఫ్ట్ లో  జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు లిఫ్ట్ ఫెయిల్ అయ్యి కింద పడిపోయింది.  దీంతో అప్పుడే  ఆపరేషన్‌ చేయించుకున్న సరోజ గాయాలతో  మృతి చెందింది. 

telugu-news | khammam | bhadradri-kothagudem 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు