/rtv/media/media_files/2025/09/24/khammam-crime-2025-09-24-15-32-06.jpg)
Khammam Crime
ప్రస్తుతం కాలంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కొందరు విరుచుకుపడుతున్నారు. క్షణకావేశంలో తోటివారిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తెలంగాణలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక అమానవీయ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అన్నం తింటూ కూర లేదని చెప్పినందుకు ఒక మహిళపై ఆమె తోటి కార్మికుడు గొడ్డలితో దాడి చేశాడు. చిన్నపాటి గొడవ ఇంతటి హింసాత్మక చర్యకు పాల్పడడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Khammam Crime
ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో కిటికీలు తయారు చేసే కంపెనీ ఉంది. అందులో బానోత్ రుక్మిణీ, రవి ఇద్దరూ ఒకే చోట పనిచేసే తోటి కార్మికులు. వీరిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ పక్కపక్కన నివాసముంటున్నారు. ఇటీవల మధ్యాహ్నం భోజనం సమయంలో రుక్మిణీ అన్నం తింటుండగా.. రవి ఆమె వద్దకు వచ్చి కూర అడిగాడు. దీంతో రుక్మిణీ వద్ద కూర లేకపోవడంతో.. ‘‘నా దగ్గర కూర లేదు’’ అని ఆమె చెప్పింది. ఆ మాటతో రవి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
కూర అడిగితే వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2025
ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఘటన
కిటికీలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్న బానోత్ రుక్మిణీ అన్నం తింటుండగా కూర ఉందా అని అడిగిన రవి అనే కార్మికుడు
అయితే కూర తన వరకే ఉందని చెప్పగా ఆగ్రహించి గొడ్డలితో ఆమె మెడపై పలుమార్లు… pic.twitter.com/fpd782RDm5
వెంటనే పక్కనే ఉన్న గొడ్డలి తీసుకొని రుక్మిణీపై దాడికి తెగబడ్డాడు. ఆమె మెడ, తలపై అతి దారుణంగా గొడ్డలితో విచక్షణారహితంగా పలుమార్లు నరికాడు. అనంతరం ఆమె గట్టిగా అరవడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ఆపై రుక్మిణి తీవ్రగాయాలతో అతడి వెంట పడింది. స్థానికులు గమనించి ఆమెను హుటా హుటిన సమీపంలోనున్న హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడి ఒక క్షణికావేశంలో జరిగిందా లేదా దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి మాట గొడవకు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం స్థానికులను, పోలీసులను ఆశ్చర్యపరిచింది.