సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత మంత్రులు పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి, గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు ఆమోదించారు.
Also Read: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక యాప్ రెడీ: మంత్రి పొంగులేటి
తక్కువ ధరకే భూములు
రేరాలో 54 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ములుగులో సమ్మక్క-సారలమ్మ వర్సిటీకి తక్కువ ధరకే భూములు కేటాయించేందుకు ఆమోదముద్ర వేశారు. మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేట్ చేయాలని నిర్ణయించారు. అలాగే ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
రుణమాఫీ, రైతుభరోసాపై చర్చ
ఇదిలాఉండగా.. ఈ కేబినెట్ మీటింగ్‌లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో, ఇచ్చిన హామీలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్ని అమలయ్యాయి.. ఇంకా ఎలాంటి హామీలు నెరవార్చాలి అనేదానిపై చర్చ జరిగింది. అలాగే పలు హామీలు నెరవేర్చేందుకు ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీలు సమర్పించిన నివేదికలపై కూడా మంత్రివర్గం చర్చించింది. మరోవైపు రుణమాఫీ, రైతుభరోసా అమలుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే సాంకేతిక కారణాలతో ఆగిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధకారులను ఆదేశించినట్లు సమాచారం.
Also Read: ముక్కు నేలకు రాపిస్తా.. ఎవ్వరినీ వదిలి పెట్టా.. జగ్గారెడ్డి కామెంట్స్