/rtv/media/media_files/2025/01/24/tercR1kSDyahabVayA3e.jpg)
Photograph: (Gandhi Bhavan)
BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పెట్టిన డెడ్‌లైన్ దగ్గర పడుతుండటం, బీసీ రిజర్వేషన్ పై కేంద్రం ఏం తేల్చకపోవడంతో రాష్ర్ట ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే. గవర్నర్ దాన్ని కేంద్రానికి పంపగా కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ఎన్నికలకు ఎలా వెళ్లాలన్న సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్ దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమైంది.
Also Read:హిందూమహాసముద్రంలో కూలిపోయిన స్పేస్ X రాకెట్.. ఇండియాకి ప్రమాదమా?
బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కోసం కాంగ్రెస్ పార్టీ ఒక సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇవాళ సమావేశం కాబోతున్నది. సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో కమిటీ భేటీ కాబోతున్నది. ఈ సమావేశంలో ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వీహెచ్, కే.కేశవరావు,ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా మందుకు వెళ్లాలనే విషయంలో ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు మంత్రులు భట్టి, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్‌బాబు, సీతక్కలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయకోవిదుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నెల 26వ తేది వరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ఈ కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక సమర్పించలేదు.
Also Read: పైసలకు కక్కుర్తి పడి కత్తులకు పని.. సిజేరియన్‌లో పుట్టిన పిల్లలకు భయంకరమైన వ్యాధులు!
అందులో భాగంగా హైదరాబాద్‌లో ఆదివారం ఆడిటర్ జనరల్‌తో, ఢిల్లీలో సోమవారం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో మంత్రుల కమిటీ సమావేశమైంది. అయితే ఈ భేటీలో స్పష్టత రాకపోవడంతో మరికొంత మంది న్యాయనిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక మరో ఒకటి రెండు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్ లో కమిటీ సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక ఎన్నికల విషయంలో ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో సంప్రదింపుల కమిటీ నివేదిక ఆలస్యం కావడం.. ఇవాళ గాంధీ భవన్ లో సంప్రదింపుల కమిటీ భేటీ కానుండటంతో సర్వత్రా ఆసక్తిగా మారింది.
Also Read:ప్రధాని మోదీ ల్యాంచ్ చేసిన ఈ-కారు.. ప్రత్యేకతలేంటో తెలుసా?