/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/CM-KCR-1-jpg.webp)
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కేసీఅర్ సమావేశం అయ్యారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలకు కేఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను కొడితె మామూలుగా ఉండదని కేసీఆర్ రేవంత్ సర్కార్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ శక్తి ఎలాంటిదో కాంగ్రెస్ వాళ్లకి చూపించి మెడలు వంచుతామని గవర్నమెంట్‌పై ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లు అయ్యిందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ఫిబ్రవరి నెలఖరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అన్నారు.
ఇది కూడా చదవండి :Supreme Court: ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు అసహనం
ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లీం సామాజిక వర్గాన్ని వాడుకుందని ఆరోపించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్ టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపిందని ఆయన ప్రశ్నించారు. సంగమేశ్వర, భసవేశ్వర ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. దెబ్బకే నీళ్లు రావాలని ఆయన అన్నారు. ఆలోచన లేకుండా ఎవడో ఏమో చెప్తే నమ్మి ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం చెప్పిందని కాంగ్రెప్ పార్టీ నాయకులపై ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి :Maoist Hidma: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. హిడ్మా ఔట్!
కరోనా టైంలో కూడా రైతుబంధు ఇచ్చి రైతులకోసం మంచి పథకాలు తెస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా గంగపాలు చేసిందని గులాబీ నేత అన్నారు. గురుకుల హాస్టల్లో తిండి బాగా లేక పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవ్వడం చాలాభాదాకరమని విచారం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయాల కోసం పుట్టింది కాదని కేసీఆర్ స్పష్టం చేశారు.
తులం బంగారానికి ఆశపడి తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌కి ఓటేశారని ఆయన చెప్పారు. రైతు బంధుకు రాంరాం.. దళిత బంధుకి జై భీమ్ చెప్తారని ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు దొరికితే గ్రామాల్లో ప్రజలు కొట్టేలా ఉన్నారని బీఆర్ఎస్ బిగ్ బాస్ అన్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై గంభీరంగా చూస్తున్నానని కేసీఆర్ వివరించారు.