Kavita: హరీశ్‌ రావు, సంతోష్‌ రావే ఫోన్‌ ట్యాపింగ్ చేయించారు.. కవిత సంచలనం

ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత స్పందించారు. కేటీఆర్‌కు సంబంధించిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్‌లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని స్పష్టం చేశారు.

New Update

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కవిత కూడా స్పందించారు. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటుసులు వచ్చాయని తెలిపారు. కేటీఆర్‌కు సంబంధించిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్‌లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని స్పష్టం చేశారు. అంతేకాదు తాను కేసీఆర్‌కు రాసిన లేఖను కూడా సంతోష్ రావు లీక్ చేశారని ఆరోపించారు. ఇకనుంచి కేసీఆర్‌ ఫొటోతోనే నేను కార్యక్రమాలు చేస్తానని'' కవిత అన్నారు.   

Advertisment
తాజా కథనాలు