Robbery: గోదావరిఖనిలో దొంగల బీభత్సం.. రూ.27 లక్షలకు పైగా చోరీ..!
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దొంగలు రెండు ఏటీఎంలు ధ్వంసం చేశారు. ఒకదాంట్లో సుమారు రూ.27,75,400 నగదు అపహరించినట్లు తెలుస్తోంది. మరో ఏటీఎంలో నగదును చోరీ చేసేందుకు యత్నంచారు. అయితే, కొద్ది నిమిషాల తేడాతో జరిగిన ఈ రెండు దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారాయి.