Etela Rajender: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఈటల కౌంటర్ తనకు మల్కాజ్‌గిరి ఏంటి సంబంధం అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఈటల రాజేందర్. తను ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన బిడ్డ కాదని.. తెలంగాణ బిడ్డను అని అన్నారు. తాను ఇప్పటివరకు ఏ నాయకుడిని వ్యక్తిగత దూషణలు చేయలేదని తెలిపారు. By V.J Reddy 10 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Etela Rajender: సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మల్కాజిగిరికి తనకు సంబంధం ఏంటి అని అడుగుతున్నాడని.. ఈటల రాజేందర్ అనేటోడు ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన బిడ్డ కాదని అన్నారు. ఈ 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టి బిడ్డగా, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన బిడ్డను అని పేర్కొన్నారు. ALSO READ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు షాక్! 'ఎవరి మీద పడితే వారి మీద, ఏది పడితే అదే... చప్పట్లు కొట్టగానే రెచ్చిపోయి మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. కానీ ముందుంది ముసళ్ళ పండగ. ఈ రాష్ట్రంలో తొలి ఆర్థికమంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బడ్జెట్ తెచ్చుకున్నాం. ఈనాడు ఈ రాష్ట్ర ఆర్థిక స్థితి ఏముందో, ఏం కాగలదో చెప్పగలిగే సత్తా నాకుంది. కానీ మూడు నెలలకే ఎవరి మీద విమర్శ చేయకూడదు కాబట్టి చేయడంలేదు. నా మొత్తం రాజకీయ జీవితంలో ఏ నాయకుడి మీదగానీ, ఏ పార్టీ మీదగానీ వ్యక్తిగతమైన దూషణలు చేయలేదు. నేను సంస్కారం ఉన్నవాడిని.' అని అన్నారు. 'ఏ పొలిటికల్ లీడర్ చాలా ఎవాల్వై ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. సంకుచితంగా ఉండేవాడు పొలిటికల్ లీడర్ కాడు. పొలిటికల్ లీడర్ సంకుచితవాది, డైరెక్షన్ లేని వాళ్ళు అయితే వ్యవస్థ కూలిపోద్ది అని నమ్మే వాడిని నేను, అలాంటి చిన్న, కురుస నాయకులు గురించి నేను మాట్లాడను. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి రాసుకున్నోడికి తెలవదు, విన్న మనకు కూడా తెలుసుకునే ఆస్కారం లేకుండా పోయింది. ఇచ్చిన హామీలు అమలై మా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.' అని పేర్కొన్నారు #etela-rajender #malkajgiri #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి