TS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హన్మంతరావు కొద్దిసేపటి క్రితం మరణించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హన్మంతరావు కొద్దిసేపటి క్రితం మరణించారు.
ఫోన్‌ట్యాపింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ బరితెగించి, ఓ తాగుబోతులా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. దానికి ఫలితం కేటీఆర్ కచ్చితంగా అనుభవిస్తాడని అన్నారు.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్ రాజీనామా చేశారు. ఆయన పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించారు. కానీ.. టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కిషన్ రెడ్డికి లేఖ రాశారు ఆరేపల్లి మోహన్. ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం.
బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడాలని సీఎంను కోరారు.
TS: నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. రేవంత్ కూడా సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉండి రేవంత్ ఒక్క పని చేయలేదని.. ఓటమి భయంతోనే తన సవాల్‌ను రేవంత్ స్వీకరించడం లేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పేర్కొన్న మైనారిటీ డిక్లరేషన్ అంటే హిందువులపై దాడులు చేయడమేనా అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగిచెర్ల బాధితులను పరామర్శించిన ఆయన బాధితులకు రక్షణ కల్పించి, నిందుతులందరినీ కఠినంగా శిక్షించాలన్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని.. ఓ వ్యక్తి మనస్తాపంతో ఉరేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం.. కోలనూర్ గ్రామంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
చెంగిచర్లలో ఎస్టీ సామాజికవర్గ మహిళలపై జరిగిన దాడిని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. మహిళలనే ఇంగిత జ్ఞానం లేకుండా గూండాలు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. తమ సహనాన్ని చేతకానిదిగా భావిస్తే ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.