సిరిసిల్లలో కేసీఆర్ బస్సు యాత్ర-LIVE
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఈ రోజు సిరిసిల్లలో జరుగుతోంది. కేసీఆర్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఈ రోజు సిరిసిల్లలో జరుగుతోంది. కేసీఆర్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
తనను ఓడించేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. బండి సంజయ్ ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కరీంనగర్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ కీలక నేత బండి సంజయ్ బరిలో ఉన్న నేపథ్యంలో.. కేసీఆర్ ఏం మాట్లాడుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
TG: బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.. కానీ తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిందే గాడిద గుడ్డు అని కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. ఆరు గ్యారంటీలతో మోసగించిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ అని సెటైర్లు వేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.
కరీంనగర్లో ఈసారి బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ విజయం పక్కా అనిపిస్తోంది అన్నారు ప్రధాని మోదీ. బండి సంజయ్కు మద్దతుగా వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. అంతకుముందు వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓరుగల్లులో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వేములవాడకు బయల్దేరి వెళ్తారు. వేములవాడ రాజన్నకు కోడేమొక్కులు చెల్లించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. పిరమైన ప్రధాని అంటూ ట్విట్టర్ (X)లో విమర్శలు చేశారు. ముడి చమురు ధరలు తగ్గినా.. మోడీ హయాంలోపెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పండి అని ప్రశ్నించారు.
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లు కూడా తనకేనని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వేలకు అందని ఫలితం మల్కాజ్ గిరిలో రాబోతోందన్నారు. ఈ రోజు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కరీంగనగర్ జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ జూదం కోసం స్నేహితుల వద్ద రూ.12 లక్షలు అప్పు చేసి వాటిని పోగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువవ్వడంతో చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.