Trains: నెల రోజుల పాటు రైళ్లు బంద్!
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని కాజీపేట, సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సుమారు నెలరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని కాజీపేట, సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సుమారు నెలరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.
TG: కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్, ఈసీకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
సూల్తానాబాద్ ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పసిపాపపై ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలంటూ డీజీపీ రవి గుప్తాకు ఆదేశాలు జారీ చేశారు.
TG: పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ కీచకుడు. నిందితుడు బీహార్‌కు చెందిన బలరాంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ...వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలను పూర్తి చేసేందుకునోటిఫికేషన్ విడుదల అయ్యింది.
TG: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయకమంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లనున్నారు. రేపు సీఎం ప్రమాణ స్వీకారం అనంతరం.. తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.
సింగరేణి కార్మిక కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.
TG: మంత్రి పొన్నం ప్రభాకర్ హయాంలో ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని అన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకు రూ.50 లక్షలు డబ్బులు ముడుతున్నాయని ఆరోపించారు.
కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా, బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రిగా అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, నివాస వర్మకు స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి పదవి దక్కింది.