Telangana: కాంగ్రెస్‌లోకి సంజయ్ కుమార్.. అలిగిన జీవన్ రెడ్డి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. తనకు సమాచారం ఇవ్వకుండానే సంజయ్‌ను చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.