బోనం ఎత్తిన ఈటల రాజేందర్
గోల్కొండలో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తారు. అమ్మవారు రాష్ట్రప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
గోల్కొండలో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తారు. అమ్మవారు రాష్ట్రప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
TG: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే బ్రేక్ దర్శనం అందుబాటులోకి తేనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రతిపాదనలు దేవాదాయ శాఖకు పంపినట్లు చెప్పారు. శ్రావణ మాసం మొదటి వారంలోనే బ్రేక్ దర్శనాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు అధికారులు.
కాంగ్రెస్ పార్టీ తమతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతోందని.. వారందరితో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఆ సీట్లతో తామే గెలుస్తామన్నారు బండి సంజయ్. ఎన్నికలు రావన్న ధీమాతోనే రాజ్యసభ సభ్యత్వానికి కేకేతో రాజీనామా చేయించారన్నారు.
తెలంగాణ పేపర్ మర్చంట్ అసోసియేషన్ కార్యవర్గం ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ను సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జులై 28న అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ బల్ద్వా ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో జరిగే సైకిల్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తగిలింది.అర్థరాత్రి దాటిన తరువాత ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది.అర్థరాత్రి ఒంటి గంట సమయంలో సీఎంరేవంత్ ,రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ PS పరిధిలో 14.59 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా, వాడకం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
TG: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. కరీంనగర్ జడ్పీ సమావేశంలో ధర్నాకు దిగి కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
TG: లంచం కేసులో సీఎం రేవంత్ జైలుకు వెళ్లాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత లక్ష్మణ్. యావత్ తెలంగాణ తలదించుకునేలా లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్ళలేదా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పలపాలు చేసింది కేసీఆర్ కదా అని ఫైర్ అయ్యారు.