/rtv/media/media_files/2025/03/13/odMyIu5zbmuAQhlOiR9A.jpg)
inter student injured
Inter Student: ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్ధి గదిలో నుంచి గాయాలతో బయటకొచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సహస్ర జూనియర్ కాలేజీలో చోటుచేసుకుంది. శివాన్విత అనే విద్యార్థిని పరీక్ష రాస్తుండగా .. కొక్కెం ఊడిపోయి తిరుగుతున్న ఫ్యాన్ ఆమెపై పడింది. ఫ్యాన్ రెక్కలు తగలడంతో శివాన్విత ముక్కు, కన్ను కింది భాగాల్లో గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది కాలేజీ ఆవరణలోని వైద్య శిబిరానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రథమ చికిత్స అనంతరం శాన్వితను మరో గదిలో కూర్చోబెట్టి అరగంట అదనపుతో సమాయంతో పరీక్ష రాయించారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
కరీంనగర్లోని సహస్ర కళాశాలలో విద్యార్థినికి ఊహించని షాక్
— Lokal App- Telugu (@LokalAppTelugu) March 12, 2025
ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని నీలి సాన్విపై ఊడిపడ్డ ఫ్యాన్
సాన్వికి స్వల్ప గాయాలు, అయినా పరీక్ష రాసిన సాన్వి pic.twitter.com/f6Bn7Z3uRh
Also Read: Sumalatha: అసలేమీ లేని చోట గొడవ సృష్టించకండి.. దర్శన్ కాంట్రవసీ పై సుమలత ఫైర్