Telangana: కమీషన్లు మింగేశారా..?..కాళేశ్వరంపై ఓపెన్ కోర్టులో విచారణ

కాళేశ్వరంపై మళ్లీ విచారణను ప్రారంభించింది జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌. రోజూ రెండు సెషన్లలో ఓపెన్‌ కోర్టు విచారణ సాగనుంది. కాళేశ్వరం ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఈఎన్సీ నాగేందర్‌, క్వాలిటీ కంట్రోల్‌ చీఫ ఇంజనీర్‌ అజయ్‌ కుమార్‌ హాజరయ్యారు

New Update
Kaleshwaram Fight : వాటర్ వార్.. నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటి..!

Telangana: కాళేశ్వరంపై మళ్లీ విచారణను ప్రారంభించింది జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌. రోజూ రెండు సెషన్లలో ఓపెన్‌ కోర్టు విచారణ సాగనుంది. బుధవారం నాడు కాళేశ్వరం ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఈఎన్సీ నాగేందర్‌, క్వాలిటీ కంట్రోల్‌ చీఫ ఇంజనీర్‌ అజయ్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురిపై కమిషన్‌ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈఎన్సీ నాగేందర్‌పై 3 గంటల పాటు 130కి పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి అయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌లో నిబంధనలు పాటించలేదని నాగేందర్ తెలిపారు.

Also Read:  బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..!

రామగుండం ఈఎన్‌సీ చేతిలోనే మూడు బ్యారేజీలు నడిచినట్లు కమిషన్ ముందు చెప్పారు. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే బ్యారేజీలలో లీకేజీలు జరిగాయా.. గేట్స్ ఆపరేషన్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి? నీళ్లను ఎవరు స్టోరేజ్ చేయమన్నారని కమిషన్ ప్రశ్నించింది. అలాగే వరదల సమయంలో గేట్లు ఓపెన్ చేయకూడదని ఎవరు ఆదేశించారని నాగేందర్‌‌ను క్వశ్చన్ చేసింది. పరిమితికి మించి బ్యారేజీలలో నీళ్లను స్టోర్ చేయమని ఎవరు ఆదేశించారని కమిషన్ అడిగింది. మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ డిపార్ట్‌మెంట్ మాన్యువల్ ప్రిపేర్ చేసిందా అంటూ ఈఎన్‌సీ నాగేందర్‌‌ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. 

నిబంధనలు పాటించలేదు...

రామగుండం ఈఎన్‌సీ నిబంధనలు పాటించలేదని కమిషన్ ముందు ఈఎన్‌సీ నాగేందర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన చేతిలోనే మూడు బ్యారేజీలు నడిచినట్లు  కమిషన్‌కు నాగేందర్‌ వివరించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్‌పై ఎలాంటి యాక్షన్ రామగుండం ఈఎన్‌సీ తీసుకోలేదన్నారు.  సీడబ్ల్యుసీ మాన్యువల్ నిబంధనలు ఫాలో చేశారని కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఫాలో చేయలేదని నాగేందర్ సమాధానం ఇచ్చారు. డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారా.. అని అధికారులను కాళేశ్వరం కమిషన్ అడిగింది.

Also Read: 100 కి.మీ వేగంతో గాలులు..ఆ రెండు జిల్లాలకు అలర్ట్‌!

నిర్మాణ సంస్థలు అగ్రిమెంట్ ఆపరేషన్స్ ప్రోటోకాల్ డ్యామ్ సేఫ్టీ ఆక్ట్ ఫాలో అయ్యారా అన్న ప్రశ్నకు కాలేదని నాగేందర్ సమాధానం చెప్పారు. వెదర్స్ షెడ్యూల్ ఫాలో అయ్యారా అని ప్రశ్నించగా.. దానికి కూడా కాలేదనే ఈఎన్సీ సమాధానం చేశారు. మూడు బ్యారేజీలలో నీళ్లను నిల్వ చేశారా అని కమిషన్ ప్రశ్నించగా.. 2019 నుంచి మూడు బ్యారేజీలలో పరిమితి నీళ్లను నిలువ చేసినట్లు కమిషన్ ముందు నాగేందర్ వెల్లడించారు. ప్రమాదం జరిగే ముందు ఓ అండ్ ఎం పరిశీలన చేశారా అని.. బ్యారేజీలలో నీళ్లను నిలువ చేయాలని ఎవరు? ఆదేశించారంటూ కమిషన్ అడిగిన క్వశ్చన్‌కు... రామగుండం ఈఎన్సీకి మౌకిక ఆదేశాలు ఉన్నాయి అన్నట్లుగా కమిషన్ ముందు ఈఎన్‌సీ నాగేందర్ చెప్పుకొచ్చారు.

క్వాలిటీ కంట్రోల్‌ చెక్‌ చేశారా..?

మధ్యాహ్నం తర్వాత  క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. అజయ్ కుమార్ పై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. క్వాలిటీ కంట్రోల్ సీఈ స్థాయిలో ఉండి రికార్డ్స్ చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా సబ్మిట్ చేస్తారని ప్రశ్నించింది. క్వాలిటీ కంట్రోల్ పని ఏంటి? పరిధి ఏంటి? ఇప్పటివరకు ఏం పని చేశారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

Also Read:  భర్తను అలా పిలవడం క్రూరత్వం.. కోర్టు కీలక తీర్పు!

మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను ఎన్నిసార్లు విజిట్ చేశారని అడిగింది. దీనికి ఈ రెండు బ్యారేజీలను ప్రమాదం జరగక ముందు పరిశీలించానని తెలిపారు. సుందిళ్లను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించింది. మొదటి సారి ఫ్లడ్స్ వచ్చిన తర్వాత మూడు బ్యారేజీలను క్వాలిటీ కంట్రోల్ సీఈగా  విజిట్ చేశారా..? అని కమిషన్ ప్రశ్నించింది. గ్రౌండ్ లో సమస్యలు ఉన్నాయని రిపోర్టులు రావడంతో విజిట్ చేయలేదని అజయ్ కుమార్ వివరణ ఇచ్చారు.

Also Read:  నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన

Advertisment
Advertisment
తాజా కథనాలు