CWPRS: అన్నారం బ్యారేజ్ లో నిర్మాణంలో నాణ్యతే లేదు.. కాళేశ్వరంపై మరో షాకింగ్ రిపోర్ట్!

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్నారం బ్యారేజ్ వద్ద పరీక్షలు చేసిన సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​ స్టేషన్ (CWPRS) షాకింగ్ విషయలు బయటపెట్టింది. ఈ బ్యారేజ్ లోని 16 గేట్ల నిర్మాణంలో అసలు నాణ్యతే పాటించలేదని బయటపెట్టింది.

Annaram Barrage Kaleshwaram barrage
New Update

మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో ప్రశ్నార్థకంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో భాగమైన అన్నారం బ్యారేజీ చాలా వీక్ గా ఉన్నట్లు షాకింగ్ స్టడీ బయటకు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 గేట్ల నిర్మాణంలో ఏ మాత్రం నాణ్యత లేదని ఆ స్టడీ పేర్కొనడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అనంతరం కొద్ది రోజులకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు పడిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ పుణెకి చెందిన  సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​ స్టేషన్ (CWPRS) తో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద ఫిజికల్ టెస్టులను చేయించాలని నిర్ణయించింది. దీంతో CWPRS ఈ బ్యారేజీలోని 26వ నంబర్ గేట్ నుంచి 46వ నంబర్ గేట్ వరకు పరీక్షలు చేసింది.

Also Read :  సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ

16 గేట్ల నిర్మాణంలో నాణ్యత లేదు..

మొత్తం 21 గేట్లలో వద్ద ప్యార్లల్సిస్మిక్ టెస్టులను CWPRS చేసింది. ఇందులో 16 గేట్ల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని తేలింది. 26,27, 29, 30,31, 32, 33, 34, 35, 38, 40, 42,43,44, 45, 46 గేట్ల వద్ద నాణ్యత పాటించలేదని రిపోర్ట్ ఇచ్చింది. మిగతా గేట్లకు ఇబ్బంది లేదని తెలిపింది. ఆయా గేట్ల వద్ద ప్లెయిన్ కాంక్రీట్, ఆర్సీసీని నాసిరకగా తయరు చేసి రాఫ్ట్​, సీకెంట్​పైల్స్ అంటే బ్యారేజీ పునాదిని నిర్మించినట్లు ఆ రిపోర్ట్ చెబుతోంది. ఈ రిపోర్ట్ ను గత ఆగస్టులో CWPRS నీటి పారుదల శాఖకు అందించింది.  

Also Read :  జానీ మాస్టర్ కు బెయిల్!

నాణ్యత లేదని ఎలా నిర్ధారించారంటే..

ప్యార్లల్​​సీస్మిక్​ టెస్టు ను అన్నారంలో నిర్వహించారు. ఐఎస్​ 516:2018 కోడ్స్​ ప్రకారం ఈ పరీక్ష జరిగింది. భూకంప తరంగాల వేగం ఆధారంగా నాణ్యతను నిర్ధారిస్తారు. ఈ తరంగాల వేగం ఎంత ఎక్కువ ఉంటే.. ఆ నిర్మాణంలో అంత నాణ్యత పాటించినట్లు చెబుతారు. ఒక వేళ నాణ్యత తక్కువగా ఉంటే ఆ నిర్మాణంలో నాణ్యత పాటించనట్లుగా తేలుస్తారు. అన్నారం బ్యారేజీ వద్ద టెస్టులు చేసిన సమయంలో దాదాపు 16 గేట్ల వద్ద వేగం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇదే విషయాన్ని రిపోర్ట్ లో పేర్కొన్నారు.అన్నారం బ్యారేజీలో సీస్మిక్​ వేగం ప్లెయిన్​ కాంక్రీట్ ​తో పాటు ఆర్​సీసీలో సైతం ఐఎస్​కోడ్స్​ నిర్ధారించిన ప్రమాణాల మేరకు లేదని CWPRS తేల్చింది.

ప్లెయిన్​ కాంక్రీట్​ తో పోల్చినప్పుడు ఐరన్ తో పటిష్టం చేసిన ఆర్​సీసీలో సీస్మిక్​ వేగం 1.2 నుంచి 1.9 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఆర్​సీసీలో ఉండే ఇనుములో వేవ్స్ చాలా స్పీడ్ గా ప్రయాణిస్తాయని తెలిపింది. ఆర్​సీసీలో అధికంగా ఐరన్ వాడితే అంత వేగంతో ఆ వేవ్స్ వెళ్తాయని CWPRS స్పష్టం చేస్తోంది,  బ్ల్యూపీఆర్ఎస్​ చెబుతున్నది. ఇసుకలో అయితే ఆ తరంగాల వేగం చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. అన్నారం బ్యారేజీలో ప్లెయిన్​ కాంక్రీట్, ఆర్​సీసీ రెండింటిలోనూ ప్రమాణాల మేరకు సీస్మిక్​ వేగం లేదని CWPRS నివేదిక తెలిపింది. 

Also Read :  షర్మిల సంచలన నిర్ణయం!

Also Read :  వాళ్ళని వాడుకున్నది నిజం కదా? బాబు అంటూ వైసీపీ ట్వీట్

#kaleshwaram #annaram-barrage-leakage #cwprs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe