తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ తెలంగాణ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిల్ వేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్త్వంపై జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం దాన్ని భావిస్తుందని ఆయన పేర్కొన్నారు. READ ALSO : పాలన ప్రజా విజయోత్సవాలకు కేంద్రమంత్రులు.. పొన్నం ఆహ్వానం! తెలంగాణ నా కోటి రతనాల వీణ అని మహాకవి దాశరధి గారు అన్నట్టుగానే నాడు ప్రొఫెసర్ జయశంకర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు, తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలో ఉద్యమకాలంలోనే తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకున్నామని ఆయన వివరించారు. ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మీద రాజకీయకక్షతో తెలంగాణ మీద ఈసమెత్తు కూడా అవగాహన, సోయి లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుందని జూలూరి గౌరీ శంకర్ మండిపడ్డారు.