BIG BREAKING: ముగిసిన జూబ్లీహిల్స్ పోలింగ్.. పోలింగ్ శాతం ఎంతంటే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ ముగిసింది. ఈ ఉప ఎన్నికలో సుమారు 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

author-image
By K Mohan
New Update
Jubilee Hills By Poll 2025

Jubilee Hills By Poll 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ ముగిసింది. ఈ ఉప ఎన్నికలో సుమారు 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఆరు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు. షేక్‌పేట్‌లోని కొన్ని పోలింగ్ బూత్‌ల్లో గొడవ చేసిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలు పోలింగ్ బూత్‌ల్లో చనిపోయిన వారి పేర్లతో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించారు. యూసఫ్ గూడలోని కృష్ణ నగర్ పోలింగ్ బూత్ ముందు మాగంటిసునీత ఆందోళనకు దిగారు.

ఈ ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీని కారణంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో 4 EVMలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి CRPF బలగాలను కూడా మోహరించారు.

కొన్ని చోట్ల ఈవీఎంలు మోరాయించాయి. పలు పోలింగ్ బూత్‌ల వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ ప్రక్రియ నిర్వహణ కోసం 2,060 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. మధ్యాహ్నం ఒంటిగంగ వరకు మొత్తం ఓటర్లలో సగం మంది కూడా ఓటు వేయలేదు. ఓటర్ల పెద్దగా తమ ఓటు హక్కుని ఉపయోగించుకోడానికి పోలింగ్ బూత్‌లకు రాలేదు. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నవంబర్ 14న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. 

Advertisment
తాజా కథనాలు