జంతువులను చంపి ఫారెస్ట్ ఆఫీసర్లు దావత్!

TG: జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో లిక్కర్, మాంసంతో దావత్ చేసుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు. ప్రశ్నించిన మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. దావ‌త్‌పై తనకు సమాచారం లేదని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు.

New Update

Fortest Officers:

జగిత్యాల ఫారెస్ట్‌ ఆఫీస్‌లో అధికారుల చేసుకున్న దావత్‌ చర్చనీయాంశమైంది. ఏకంగా ఆఫీస్‌లోనే మందు పార్టీ చేసుకున్నారు అధికారులు. వన్యప్రాణి మాంసంతో దావత్ చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా ఫారెస్ట్ సిబ్బంది, బీట్, సెక్షన్ ఆఫీసర్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై ఆఫీసర్ల ఓవరాక్షన్‌ చేశారు. మద్యం మత్తులో తూలుతూ అధికారులు రెచ్చిపోయారు. దావత్‌పై తనకు సమాచారం లేదని జిల్లా అటవీ శాఖ అధికారి చెప్పారు. శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు.

Also Read :  విమాన ప్రయాణికులను కాపాడిన రియల్‌ హిరోయిన్స్..

Advertisment