Hyderabadదీపావళి వేడుకల్లో అపశృతి..సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 40 మంది

హైదరాబాద్‌ లో దీపావళి వేడుకల సందర్భంగా పలుచోట్ల టపాసులు కాలుస్తూ కంటికి గాయాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో బాధితులంతా నగరంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద బారులు తీరారు. 50 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు.

hyd
New Update

Hyderabad: రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నా పెద్ద అంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. టపాసులు కాలుస్తూ సంతోషించారు. అయితే దీపావళి వేడుకల్లో కొన్ని చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నా అవి పాటించకుండా చివరకు పండుగ పూట ఆసుపత్రి దారి పట్టారు బాధితులు. హైదరాబాద్‌ లో దీపావళి వేడుకల సందర్భంగా పలుచోట్ల టపాసులు కాలుస్తూ కంటికి గాయాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. 

Also Read: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!

50 మంది బాధితులు...

మరోచోట పటాకులు కాల్చి పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా నగరంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు 50 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. ఇందులో 9 మందికి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారందరికి ప్రథమ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా 34 మందికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.

Also Read:  నేడు మూరత్ ట్రేడింగ్.. ఏ సమయంలో స్టాక్స్ కొనుగోలు చేయాలంటే?

సరోజినీ ఐ హాస్పిటల్ డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ.. దీపావళి బాణసంచా కాలుస్తూ 50 మంది గాయపడి సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారని చెప్పారు. ఇందులో 9మంది అడ్మిట్ అయ్యారని తెలిపారు. 9 మందికి శస్త్ర చికిత్స అవసరం లేదన్నారు. 9 మంది ని అబ్జర్వేషన్ లో ఉంచి వారికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తామన్నారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు ఒపి ద్వారా మొత్తం 50 మంది చికిత్స కోసం వచ్చారని క్లారిటీ ఇచ్చారు. 

Also Read: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!

34 మందికి స్వల్ప గాయాలు అయ్యాయని, గాయపడ్డవారిలో 35 మంది చిన్నారులు ఉన్నారు. 15మంది పెద్దవారు ఉన్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సరోజిని కంటి ఆస్పత్రికి గాయపడ్డవారు చికిత్స కోసం వచ్చారన్నరు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి క్షతగాత్రుల సంఖ్య తగ్గిందన్నారు. చాలావరకు అవేర్నెస్ రావడం వల్లే పెద్దగా  ఎవరు గాయపడలేదని తెలిపారు.  గత సంవత్సరం 72 మంది చికిత్స కోసం వచ్చారని, కానీ ఈ సారి 50 మంది చికిత్స కోసం వచ్చారు ఇందులో సీరియస్ కేసులు లేవని చెప్పారు.

Also Read: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటలోగా దర్శనం..!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe