BIG BREAKING: 'శంషాబాద్ ఎయిర్పోర్టును పేల్చేస్తాం'

శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబ్ పెట్టామంటూ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

author-image
By Nikhil
New Update
TELANGANA BREAKING

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన ఈ సమయంలో ఓ బెదిరింపు కాల్ హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టినట్లు ఈ రోజు అధికారులకు ఓ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రమంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజంగానే పెట్టారా? లేకా ఇది బెదిరింపు కాల్ మాత్రమేనా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

మరో వైపు భారత్-పాక్ మధ్య దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అనేక ఫ్లైట్లను ఇప్పటికే రద్దు చేశారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికులను లోపలికి అనుమతిస్తున్నారు. పంజాబ్, కశ్మీర్, జమ్మూ, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 24 ఎయిర్పోర్టులను కేంద్రం మూసివేసింది. ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే మరిన్ని ఎయిర్పోర్టులను కూడా మూసివేసే ఛాన్స్ ఉంది.

(latest-telugu-news | telugu breaking news | telugu-news)

Advertisment
తాజా కథనాలు