/rtv/media/media_files/2026/02/13/aliabad-municipality-2026-02-13-15-44-57.jpg)
Aliabad Municipality
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తి నెలకొంది. ఈ మున్సిపాలిటీలో 20 వార్డులుండగా 11 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్ 7, బీజేపీ 3, బీఎస్పీ 1 స్థానాల్లో గెలిచాయి. మిగిలిన ఒక్క వార్డులో గాదె వెంకటేశ్ అనే స్వంతంత్ర అభ్యర్థి గెలిచారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వెంకటేశ్‌ను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నాయి. తనకు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇచ్చే పార్టీకే తాను మద్దతిస్తానని వెంకటేశ్ స్పష్టం చేశారు. దీంతో అలియాబాద్ మున్సిపల్ ఛైర్మన్ ఎవరికి వస్తుందో అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read: వర్ధన్నపేటలో ఉద్రిక్తత: రీకౌంటింగ్‌లో మారిన ఫలితం!
ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేశ్‌ను కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లనీయకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు అడ్డుకున్నారు.దీనిపై జోక్యం చేసుకున్న పోలీసులు వెంకటేశ్‌ను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Follow Us