Telangana: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణ లో వర్షాల గురించి హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారులు ఓ కీలక అప్డేట్‌ ఇచ్చారు.బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ద్రోణి తరహా వాతావరణం ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

ap rains
New Update

తెలంగాణ లో వర్షాల గురించి హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారులు ఓ కీలక అప్డేట్‌ ఇచ్చారు.  రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ద్రోణి తరహా వాతావరణం ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు లేకపోయినా.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Also Read: చదువు కోసం రోజూ గంగను ఈదిన స్వాతంత్ర సమరయోధుడు‌‌

ఈ క్రమంలోనే నేడు మహబూబ్‌నగర్‌, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట,  మహబూబాబాద్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వంటి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. దీంతో అధికారులు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌  జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే పగటిపూట 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే ఛాన్స్ ఉందని అన్నారు.

Also Read:  గాంధీ గురించి బోస్ ఏమనే వారో తెలుసా!

ఉదయం ఎండ కాసినా.. సాయంత్రానికి చల్లబడి వర్షాలు కురుస్తాయని అన్నారు. గాలుల వేగం చూస్తే గంటకు 30-40 కి.మీ వేగంతో కొన్ని చోట్ల బలమైన గాలులు వీస్తాయన్నారు. పలు ప్రాంతాల్లో వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశాలున్నాయని అధికారులు సూచించారు. ఇక గత రెండ్రోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. నగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. 

నగరంలోని పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ప్రధాన రహదారులలో వరద నీరు నిలిచిపోవటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Also Read: ఇరాన్‌ అతి పెద్ద తప్పు చేసింది..మూల్యం చెల్లించుకుంటుంది!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe