Israel: ఇరాన్‌ అతి పెద్ద తప్పు చేసింది..మూల్యం చెల్లించుకుంటుంది!

ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడటం పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్ర తప్పిదంగా పరిగణించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు.

New Update
nethanyuhu

Israel: ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడటం పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌ భారీ తప్పిదానికి ఒడిగట్టిందని, తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. జెరూసలెంలో అధికారులతో భద్రతా కెబినెట్‌ సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు ఇరాన్‌ చర్యల పై మండిపడ్డారు.

ఇజ్రాయెల్‌ పై ఇరాన్‌ దాడి విఫలమైనట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్‌ వ్యవస్థతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన అమెరికాకు నెతన్యాహు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Also Read: చదువు కోసం రోజూ గంగను ఈదిన స్వాతంత్ర సమరయోధుడు‌‌

ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణుల దాడికి ఇజ్రాయెల్‌ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అనే దాని పై లోతైన చర్చలు జరుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. టెహ్రాన్‌ పర్యావసనాలు ఎలా ఎదుర్కొటుందో చూడాలన్నారు. ఇప్పటికే నెతన్యాహుతో ఇరాన్‌ దాడి ఘటన పై స్పందించినట్లు తెలిపారు.

ఇరాన్‌ దాడి విఫల ప్రయోగమని, ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్‌ ఒక ప్రమాదకర దేశం, అస్థిరపరిచే శక్తి అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ భద్రతకు వాషింగ్టన్‌ కట్టుబడి ఉందన్నారు.

ఇక ఇజ్రాయెల్‌ కు మద్దతుగా ఏ దేశమైనా తలదూరిస్తే తీవ్ర పరిణాలు ఉంటాయని ఇరాన్‌ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: వ్యతిరేకించినా..నేతాజీ గాంధీజీని ఎందుకు గౌరవించేవారో తెలుసా?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు