Lal Bahadur Sastri:చదువు కోసం రోజూ గంగను ఈదిన స్వాతంత్ర సమరయోధుడు‌‌

భారత దేశానికి మరో మహాత్ముడు..జాతిపిత తర్వాత అంతటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి. భారతదేశ రెండవ ప్రధాని, స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి..జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజు ఈ రోజు.

New Update
sastri

Lal Bahadur Sastri: 

భారతదేశ రెండో ప్రధాని లాల్ బహదూర్‌‌ శాస్త్రి. కటిక పేదరికం నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన ఈయన జీవితం నేటికీ ఎందరికో ఆదర్శం. శాస్త్రి నినదించిన జై జవాన్ జై కిసాన్ అనే నినాదం నేటికీ అందరి నోళ్ళల్లో నానుతూనే ఉంది. తన నాయకత్వ లక్షణాలతో దేశ ప్రధానుల్లో ప్రత్యేకంగా నిలబడిన లాల్ బహదూర్ శాస్త్రి గురించి తెలుసుకోవలసింది ఎంతో ఉంది.

ఎదగాలనే పట్టుదలతో..

లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2, 1904న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి ఏడు మైళ్ల దూరంలో ఉన్న మొఘల్‌ సరాయ్ అనే చిన్న  పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. శాస్త్రి ఏడాదిన్నర వయస్సు ఉన్నప్పుడే తండ్రి మరణించారు. తరువాత హైస్కూల్‌ చదువుల కోసం తల్లి ఆయనను తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్ళారు. అక్కడ ఆయన మామ లాల్ బహదూర్‌‌ను వారణాసి తీసుకెళ్లి చదివించారు. అయితే శాస్త్రి చదువుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. డబ్బులు లేకపోవడం వలన రోజూ 8 మైళ్ళు నడిచి...ఆ తరువాత గంగానదిని ఈదుకుంటూ పాఠశాలకు చేరుకునే వారు. అయితే  ఆయన దీనిని ఎప్పుడూ ఆయన కష్టంగా భావించలేదు. చదువుకోవాలనే తపనతో ఎంతి కష్టాన్ని అయినా ఓర్చుకోవడానికి సిద్ధపడ్డారు. పడవ డబ్బులు మిగిలితే ఇంకో అసరం తీరుతుంది కదా అని ఆలోచింఏవారు.  అందుకే గంగను ఈదుకుంటూ పాఠశాలకు చేరుకునేవారు శాస్త్రి. ఈ పట్టుదలే ఆయనను ప్రధాని పదవి వరకు తీసుకెళ్ళింది అని చెబుతారు. 

శాస్త్రిగారు ఎక్కువగా గురునానక్ దేవ్ పుస్తకాలను చదివేవారు. ఈయన గాంధీజీ శిష్యుడు.  1921లో, 17 సంవత్సరాల వయస్సులో, శాస్త్రి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ చేసిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరారు. దీని కోసం తన చదువును సైతం త్యజించారు. బంధువులందరూ వ్యతిరేకంగా ఉన్నా కూడా వెనుకడుగు వేయలేదు. అంతేకాదు లాల్ బహదూర్ శాస్త్రి కుల వ్యవస్థకు పూర్తి వ్యతిరేకం. దాని కోసం తన ఇంటి పేరును కూడ వదులుకున్నారు. ఈయన గాంధీ నేతృత్వంలో 1930లో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయ్యారు. అదే సంవత్సరంలో అలహాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. 1930లో రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకు 1946 వరకు జైలు శిక్ష అనుభవించారు. 

భారతదేశ రెండవ ప్రధాని..

1964లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత ఆయన ప్రధాని పదవిని చేపట్టారు. అంతకు ముందు నెహ్ర ప్రధానిగా ఉన్న సమయంలో ఈయన హోం, రైల్వే శాఖలకు మంత్రిగా పని చేశారు. కేవలం రెండు సంవత్సరాల మంత్రి పదవితో ఆయన దేశంలో బలమైన మార్పులు తేగలిగారు. లాల్ బహదూర్ శాస్త్రి పదవీకాలం లో ఉన్నప్పుడే 1965లో భారత్‌‌పాకిస్తాన మొదటి యుద్ధం జరిగింది. అప్పుడే ఆయన జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇది యుద్ధ సమయంలో సైనికులు, రైతుల మనోధైర్యాన్ని పెంచింది. భారతదేశ ఆహారోత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, శాస్త్రి అదే ఏడాది హరిత విప్లవాన్ని కూడా ప్రచారం చేశారు.ప్రధానిగా ఆయన 19 నెలలుపాటు పని చేశారు. జనవరి 11, 1966లో ప్రధాని హోదాలో రష్యా వెళ్ళిన లాల్ బహదూర్ శాస్త్రి అక్కడ తాష్కెంట్‌లో గుండెపోటుతో మరణించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు