/rtv/media/media_files/2025/04/21/0w7NxzAG3Uwv6NSpYSaA.jpeg)
IAS అధికారి స్మితా సబర్వాల్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సామాజిక సమస్యలపై స్పందిస్తూ ఆమె చేసే ట్విట్లు వివాదాలకు దారితీసి సందర్భాలు కూడా ఉన్నాయి. నిన్న మొన్నటిదాక జరిగింది ఒకెత్తైతే.. ఇప్పుడు, ఇకపై జరిగేది మరోలా ఉండబోతోంది. ప్రభుత్వాధికారి.. ప్రభుత్వానికే ఎదురు తిరిగితే ఎలా ఉండబోతుందో చూడాలి మరి. స్మితా సబర్వాల్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.
సివిల్ సర్వీసులో దివ్యాంగుల కోటాకు రిజర్వేషన్‌పై స్మితా సబర్వాల్ చేసిన ట్విట్ కొన్ని నెలల క్రితం సంచలనంగా మారింది. దాని తర్వాత కారు రెంట్ కోసం వర్సిటీ నిధులు చెల్లించారని నోటీసులు తీసుకున్నారు. ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూవివాదంలో కూడా ఆమె పేరు వినబడుతుంది. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ అకౌంట్ పోస్ట్ చేసిన AI జనరేటడ్ ఫొటోను ఆమె రీపోస్ట్ చేశారు.
#Ghibli Story On #Hyderabad Today! #SaveHCU #SaveHCUBioDiversity#SaveHyderabadBioDiversity 🏞️ pic.twitter.com/ozbmxvSZ7D
— Hi Hyderabad (@HiHyderabad) March 31, 2025
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో టెక్నాలజీ వాడి అసత్యాలను ప్రచారం చేసిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ పోస్ట్ పెట్టటంపై వివరణ కోరుతూ స్మితా సబర్వాల్‌కు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమెతోపాటు పలువురు సెలబ్రెటీల పోస్టులపై కూడా పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీసుల విచారణకు స్మితా సబర్వాల్ హాజరైయ్యారు. తర్వాత ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. పోలీసులకు సహకరిస్తానని చెబుతూనే.. తాను రీపోస్ట్ చేసిన ఏఐ ఫొటో పోస్ట్‌ను 2000 మందికి పైగా షేర్ చేశారని స్మితా సబర్వాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు. మరి వారందరికి కూడా నోటీసులు జారీ చేస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఒకవేళ అలా చేయకపోతే.. ఇది సెలెక్టివ్ టార్గెటింగ్ అవుతుందని, చట్టం ముందు అందరూ సమానమనే అంటూ ట్వీట్ చేశారు.
Have fully cooperated with Gachibowli police authorities, and given my detailed statement today as a law abiding citizen under BNSS Act.
— Smita Sabharwal (@SmitaSabharwal) April 19, 2025
The post was reshared by 2000 individuals on this platform.
I sought clarification on whether same action is initiated for all!
If not,…
వాటికి తోడు.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తెలిపే పోస్టును కూడా రీపోస్ట్ చేశారు ఆమె.
In the matter pertaining to large-scale felling of trees in the Kancha Gachibowli area of Telangana, the Supreme Court today expressed that restoration of status quo at the site will be the Court's first priority and the Wildlife Warden of the State shall take immediate steps to… pic.twitter.com/Q69DgnSGPN
— Live Law (@LiveLawIndia) April 16, 2025
సర్కారుకు ఎదురు తిరిగి
స్మితా సబర్వాల్ రేవంత్ సర్కార్‌కు ఎదురు తిరిగి ప్రభుత్వానికే సవాల్ విసిరారని కొందరు బావిస్తున్నారు. స్మితా సబర్వాల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులు పెట్టటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్మితా సబర్వాల్‌కు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూలో ఏం జరగబోతుందని సర్వత్రా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆమెపై డిసిప్లెనరీ యాక్షన్ తీసుకొచవ్చని చర్చ జరుగుతోంది.
ఆ IAS అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు. .??
— Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) April 19, 2025
అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా. .??
అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (CMO లో Irrigation బాధ్యతలు నిర్వహించిన) వీరే. . ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో. .??
అసలు… pic.twitter.com/0KnHYAVeg5
సివిల్ సర్వెంట్లు ఎవరైనా సరే ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, విధానాలు చేస్తే సర్వీస్ కాండాక్ట్ రూల్స్ ప్రకారం ఉన్నత అధికారులు వారి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే వివాదం ఇంకా ముదురుతోంది. గత ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ ఉన్నత పదవుల్లో కొనసాగారు. సీఎంఓ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతేకాదు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. స్మితా సబర్వాల్ 2024 జనవరి 4 నుంచి నవంబర్ 11 వరకు తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా పని చేయగా, తర్వాత యువజనాభివృద్ధి, పర్యాటక & సంస్కృతి శాఖ కార్యదర్శిగా నియమించబడ్డారు.
( ias-smita-sabharwal | ias officer smita sabharwal | ias smita sabharwal entry | smita sabharwal ias controversy | latest-telugu-news)