Telangana Jagruthi : కృష్ణారావుపై ఆరోపణలను డాక్యుమెంట్లతో సహా నిరూపిస్తా...జాగృతి కవిత సంచలన కామెంట్స్‌

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫ్రస్ట్రేషన్ ను బయట పెడుతోందని, ఆయనపై తాను చేసిన రోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తానని తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
FotoJet - 2025-12-10T132546.594

Jagruthi Kavitha's sensational comments

Telangana Jagruthi : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫ్రస్ట్రేషన్ ను బయట పెడుతోందని, ఆయనపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తానని తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కృష్ణరావు అన్న మాటలకు ఫీలయ్యేది లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం పనిచేస్తలేవన్న కవిత జనం గళంగా జాగృతి పనిచేస్తుందని తెలిపారు.ఎమ్మెల్యే కృష్ణారావు  చేసిన విమర్శలపై నేను ఆధారాలతో సహా సమాధానం చెప్తాను. ఆయన చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్ పెడతాను. కూకట్ పల్లిలో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే నేను చెప్పాను. ఆయన మాట్లాడిన మాటాలకు ఫీలయ్యేది లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని కవిత స్పష్టం చేశారు. 

 జాగృతి జనం బాటలో భాగంగా ఐదు రోజుల పాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తామన్న కవిత ఇవ్వాళ మనం కంటోన్మెంట్ లోని బోయినపల్లి గవర్నమెంట్ స్కూల్ లో ఉన్నామన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్ ను బాగు చేశారు. కానీ కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు లేవు. వాటిని మేము ఏర్పాటు చేస్తామన్నారు. ఈ స్కూళ్లోనే అంగన్ వాడీని కూడా కలిపారు. అంగన్ వాడీలో హెల్పర్లు లేరన్నారు. జనం బాటలో భాగంగా విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టాం. స్కూల్స్, హాస్పిటల్స్ లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నాం. ఇండ్లు, ఇళ్ల పట్టాలు లేని వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నామన్నారు. మా వరకు చేయగలిగేది మేము ఒక సంస్థ గా చేస్తామని కవిత వివరించారు.

టాప్ టెన్ విద్యార్థులకు మా తరఫున స్కాలర్ షిప్ లు ఇస్తామన్న కవిత అదే విధంగా ప్రభుత్వం నుంచి  సాధించే  వాటిని కూడా మేము చేయిస్తామని హామీ ఇచ్చారు. ఏ జిల్లా కు వెళ్లిన  ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది అన్న కవిత, సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటోందన్నారు.ప్రజల సమస్యలను వీలైనంతగా మేము పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం లో నన్ను నిజామాబాద్ కే పరిమితం చేశారని, దానివల్ల అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదన్నారు. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది. ఏం జరగలేదన్నది జనం బాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. మేము చేయగలిగేవి చేస్తాం. మిగిలిన సమస్యలపై ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని కవిత  స్పష్టం చేశారు. మంచిని మంచి, చెడును చెడు అనే అంటామని తేల్చి చెప్పారు. ఈ స్కూల్ ను బాగు చేశారు. బాగుందనే అంటాం. రాష్ట్రంలో ప్రతిపక్షం పట్టించుకోవటం లేదు. పాలక పక్షం అసలే పట్టించుకుంట లేదు. అందుకే జాగృతి జనం గళమై పనిచేస్తోందని కవిత చెప్పుకొచ్చారు.

Advertisment
తాజా కథనాలు