TPCC: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్దికి తనకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని. పీసీసీ అధ్యక్షుడిగా తను సంతోషంగా ఉన్నానని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సభ్యులతో తనకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను చాలా సంతోషంగా ఉన్నానన్న మహేష్ గౌడ్, మంత్రి పదవి కావాలని తాను ఎక్కడ అడగడం లేదని కూడా ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం.
జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, ప్రస్తుతం ఉన్న కొంతమందిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. అందులో మహేష్ గౌడ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే దాన్ని మహేష్ గౌడ్ కొట్టి పారేశారు. పార్టీ లో నేను సాధారణ కార్యకర్త స్థాయి నుంచి వచ్చాను. పార్టీ ఏ బాధ్యతను అప్పగించినా నిర్వర్తిస్తాను. నేను మంత్రి వర్గంలోకి వెళ్లాలని ఆరాటపడటం లేదు. నాకు సీఎంతో పాటు మంత్రివర్గం మొత్తం పూర్తిగా సహకరిస్తున్నారు. నాకు, సీఎంకు ఎలాంటి గ్యాప్ లేదు'. అంటూ మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.
మరోవైపు తెలంగాణలోనూ ఓటు చోరీ జరిగిందని మహేష్ గౌడ్ ఆరోపించారు... పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి ఎక్కువ సీట్లు గెలిచిందని తెలిపారు. నిజామాబాద్‌లో ఓటు చోరీ చేసినట్లు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఓల్డ్ సిటీలో ఆధారాలను ఫిరోజ్ ఖాన్ బయట పెట్టాడన్నారు.
అలాగే ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తుందనుకోవడం లేదని కూడా టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.'ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉంది. దానం నాగేందర్ మా పార్టీ విధానాలు నచ్చి మాతో కిసి నడుస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో ఇంపార్టెంట్ వ్యక్తులకు కేసీఆర్ ఫోన్ లు చేసినట్లు మాకు సమాచారం ఉందని మహేశ్‌గౌడ్ చెప్పడం గమనార్హం. ఇక ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం దురదృష్టకరమన్న ఆయన బాంబు బ్లాస్టర్, కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యమని స్పష్టం చేశారు.
Also Read : మరో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో నమోదు
TPCC: మంత్రి పదవి అక్కర్లేదు..సంతోషంగా ఉన్నా..టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్దికి తనకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని. పీసీసీ అధ్యక్షుడిగా తను సంతోషంగా ఉన్నానని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సభ్యులతో తనకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
TPCC Chief Mahesh Kumar Goud