HYDRA : హైడ్రా దూకుడు.. ఈరోజు భారీగా కూల్చివేతలు!

TG: హైడ్రా దూకుడు పెంచింది. మూసి పరీవాహక ప్రాంతాలతో పాటు అమీన్పూర్, కూకట్పల్లిలో నల్లచెరువులో అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కాగా మూసీ పరీవాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

author-image
By V.J Reddy
New Update
hmsgar

Hydra: హైదరాబాద్ నగరంలోని చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా దూకుడు పెంచింది. ఈరోజు నుంచి మూసీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలను ప్రారంభించనుంది. మూసీ ఆక్రమణలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. మూసీ పరీవాహక ప్రాంతంలో 12 వేల ఆక్రమణలు హైడ్రా అధికారులు గుర్తించారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మూసి నది ప్రక్షాళన చేసి తీరుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మూసి నది చుట్టూ ఉన్న ఆక్రమిత కట్టడాలను గుర్తించేందుకు మున్సిపల్ శాఖ అధికారులతో ప్రభుత్వం ఏరియల్ సర్వే చేయించింది. తాజాగా మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. మూసీ పరీవాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

నల్లచెరువులో..

హైదరాబాద్ అమీన్పూర్, కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు షురూ చేసింది. నల్లచెరువులో ఆక్రమణలు కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది. తెల్లవారుజామునే ప్రొక్లెయినర్లతో  అధికారులు కూల్చివేత స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా  పోలీసులు   భారీగా మోహరించారు. హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 16 షెడ్లు నిర్మించి అక్కడ ఆక్రమణదారులు వ్యాపారం నిర్వహిస్తున్నారు. కూల్చివేతలపై సర్వే చేసి అధికారులు నోటీసులు ఇచ్చారు.

Also Read :  నేటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష

Advertisment
Advertisment
తాజా కథనాలు