HYDRA: హైదరాబాద్ చెరువులు, నాళాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో చెరువులు పునరుజ్జీవనంపై క్షేత్రస్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ రంగనాథ్ సారథ్యంలోని హైడ్రా బృందం రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనున్నారు.
ALSO READ: మద్యం మత్తులో అలా చేశా.. విచారణలో విజయ్ మద్దూరి వింత సమాధానాలు!
పలు కీలక సమస్యలను...
Also Read : నందీశ్వరుల విగ్రహ తవ్వకాల్లో బిగ్ ట్విస్ట్.. అయోమయంలో గ్రామస్థులు
అక్కడ చెరువులను అధ్యయనం చేసి హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్న బాచుపల్లిలోని ఎర్రగుంట చెరువు, మాదాపూర్ లోని సున్నంచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్ లోని అప్పచెరువులకు పునరుజ్జీవం కల్పించనున్నారు. దీంతో పాటు భారీ వర్షాలు కురిసినప్పుడల్లా హైదరాబాద్ మహా నగరాన్ని వరద నీరు ముంచెత్తడం, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులతో హైడ్రా అధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం.
Also Read : యోగ టీచర్ నుంచి సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి.. అనుష్క సినీ జర్నీ
Also Read : కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ