హైదరాబాద్‌లో ఇన్ని చెరువులు కబ్జా అయ్యాయా?

హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించడం ప్రారంభించాక చెరువులు, కుంటల కబ్జాల బాగోతం బయటపడుతోంది. తెలంగాణ రాకముందే 225 చెరువులు కనుమరుగైపోగా రాష్ట్రం వచ్చాక మరో 44 మాయమైపోయినట్లు భట్టి విక్రమార్క చెప్పారు.

LAKES
New Update

HYDRA: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు కబ్జా చేసిన కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాకు చట్టబద్దత కలిపిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఓ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందే 225 చెరువులు కనుమరు అయిపోయాయని..  రాష్ట్రం వచ్చాక మరో 44 మాయమైపోయాయని అన్నారు. ఇదిలా ఉంటే అసలు హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉండేవి.. ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయనే చర్చ యావత్ తెలంగాణ తో పాటు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. 

మొత్తం 396 చెరువులు స్వాహా...

రాజధాని పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయన్న దానిపై రిమోట్‌ సెన్సింగ్‌ ఇచ్చిన వివరాలు ప్రకారం.. బాహ్యవలయ రహదారి పరిధిలో మొత్తం 920 చెరువులు ఉండగా వాటిలో తెలంగాణ రాకముందు అంటే 2014 నాటికే 225 చెరువులు కబ్జాకు గురయ్యాయని తేలింది. అందులో 695 మాత్రమే మిగిలాయని పేర్కొంది. మరోవైపు 2014 నుంచి ఇప్పటివరకు అంటే గత పదేళ్లలో 44 పూర్తిగా, 127 పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్లు లెక్కలు చెబుతున్నాయి.

1970లో 4,150 చెరువులు.. 

హెచ్‌ఎండీఏ పరిధిలో 4,150 వరకు చెరువులు, కుంటలు ఉండేవని నీటిపారుదల శాఖ లెక్కల్లో తేలినట్లు సమాచారం. అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం 3,000 ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హెచ్‌ఎండీఏ రికార్డుల్లో కేవలం 2000 వరకే చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో శాఖ వద్ద ఒక్కో తరహా లెక్కలు ఎందుకు ఉన్నాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా దీన్ని నిర్ధారించుకునేందుకు హైడ్రా అధికారులు సర్వే ఆఫ్‌ ఇండియా సాయం తీసుకుంటున్నారు. దసరా తరువాత హైడ్రా మరింత దూకుడుగా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.

Also Read :  దసరా వేళ తప్పిన భారీ ప్రమాదం!

#bhatti-vikramarka #hydra #hmda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe