నీళ్లు వస్తాయని కాదు.. Hydra వస్తుందని.. భయంతో చెరువును ఏం చేశారంటే? హైడ్రా భయంతో మంచిరేవుల గ్రామస్థులు దారుణానికి పాల్పడ్డారు. ఇటీవల వర్షాలకు నిండిన వీరభద్రస్వామి గుట్ట దగ్గరలోని మల్లన్న కుంట అలుగును తెంపేశారు. తమ ఇళ్లలోకి నీరు వస్తే హైడ్రా చర్యలు తీసుకుంటుందనే భయంతో ఈ చర్యకు పాల్పడ్డారు. అధికారులు వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. By srinivas 24 Sep 2024 | నవీకరించబడింది పై 24 Sep 2024 20:29 IST in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి HYDRA : హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదంమోపుతున్న సంగతి తెలిసిందే. చెరువులు, కుంటలు, కాలువలను రక్షించేందుకు రంగనాథ్ అండ్ టీమ్ సీరియస్‌గా పనిచేస్తోంది. ఇందులో భాగంగానే బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలను నేలమట్టం చేస్తోంది. అంతేకాదు ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న రంగనాథ్.. నీటిలో మునిగిన కాలనీలు, కట్టడాలను మార్క్ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ భయంతోనే మంచిరేవులలో కొంతమంది స్థానికులు దారుణానికి పాల్పడ్డారు. మరోసారి వర్షాలు పడితే వరద తమ ఇళ్లల్లోకి వస్తుందనే భయంతో నిండిన కుంట అలుగును తెంపేశారు. ఇళ్లలోకి నీరు చేరితే హైడ్రా యాక్షన్ తీసుకుంటుందనే నెపంతో జేసీబీ తెప్పింది కట్టను తెంపేశారు. హైడ్రా కంటపడకుండా ఉండేందుకు.. ఈ మేరకు మంచిరేవుల వీరభద్రస్వామి గుట్టకు వెళ్లేదారిలో ఎకరం 29 గుంటల విస్తీర్ణంలో మల్లన్న కుంట ఉంది. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇది నిండింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు.. హైడ్రా కంటపడకుండా ఉండేందుకు కుంట కట్టను తెంపి నీటిని బయటికి వదిలారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి.. వెంటనే వీఆర్ఏలను మల్లన్న కుంటకు పంపించి వివరాలు సేకరించారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు. కట్ట తెంచిన వారిపై కేసులు నమోదు చేయిస్తామని అధికారులు తెలిపారు. Also Read : కొత్త ఫోన్ కొన్నందుకు పార్టీ ఇవ్వలేదని. స్నేహితులు ఏం చేశారంటే? #hyderabad #hydra #av-ranganath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి