Hydra: అర్ధరాత్రి వరకు కొనసాగిన హైడ్రా కూల్చివేతలు..

అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. అక్కడ 164 సర్వే నెంబర్‌లోని ఒక ఆస్పత్రి, రెండు అపార్ట్‌మెంట్లను నేలమట్టం చేశారు. అమీన్‌పూర్‌లో పరిధిలోని సర్వే నెంబర్‌ 12లో 23 ఇళ్లు కూల్చివేశారు.

author-image
By B Aravind
New Update
Hydra

హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించిన అక్రమ కట్టడాలపై హైడ్రా రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. అక్కడ 164 సర్వే నెంబర్‌లోని ఒక ఆస్పత్రి, రెండు అపార్ట్‌మెంట్లను నేలమట్టం చేశారు. బాహుబలి మెషిన్లతో ఈ అక్రమ కట్టాలను కూల్చివేశారు. అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని సర్వే నెంబర్‌ 12లో 23 ఇళ్లు కూల్చివేశారు. హైడ్రా కూల్చివేసిన వాటిలో ఓ అయిదంతస్తుల భవనం కూడా ఉంది. మరో భవనం నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పొదల కంటి కళ్యాణ్‌దిగా అధికారులు గుర్తించారు. 

Also Read: నేటి నుంచి భారీ వర్షాలు... జిల్లాలకు అధికారుల హెచ్చరికలు!

Advertisment
తాజా కథనాలు