అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్.. ఆ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టం

అమీన్‌పూర్‌ మున్సిపాలిటి పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చివేస్తున్నారు.

New Update
Hydra demolishing

హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన కుంటలు, చెరువులు, రోడ్లను కాపాడే దిశగా హైడ్రా దూసుకుపోతోంది. అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఏదో ఒక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి హైడ్రా కూల్చివేతల పర్వం మొదలు పెట్టింది. 

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు

ఇప్పటికే అమీన్‌పూర్‌పై ఫోకస్ పెట్టిన హైడ్రా అధికారులు చాలా ఏరియాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. కృష్ణా రెడ్డిపేటలోని 12వ సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దాదాపు 16 అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేశారు. 

ఇది కూడా చదవండి: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ!

మరోసారి అమీన్‌పూర్‌పై హైడ్రా ఫోకస్

ఇక ఇప్పుడు మరోసారి హైడ్రా అధికారులు అమీన్‌పూర్‌పై ఫోకస్ పెట్టారు. సంగారెడ్డి నియోజకవర్గం అమీన్‌పూర్ మున్సిపాలిటి పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. ఇవాళ ఉదయాన్ని హైడ్రా అధికారులు అమీన్‌పూర్‌కు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను మార్క్ చేసి కూల్చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం!

ఇందులో భాగంగానే వందనపురు కాలనీలోని 848 సర్వే నెంబర్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. రోడ్లను ఆక్రమించి చేపట్టిన కట్టడాలను కూల్చివేశారు. భారీ యంత్రాలతో అక్కడికి వెళ్లి నేలమట్టం చేశారు. అయితే కూల్చివేత్తల సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 

ఇది కూడా చదవండి: ఫుడ్‌ క్వాలిటీలో హైదరాబాద్‌ లాస్ట్‌...!

కాగా హైడ్రా మొదలు పెట్టినపుడు రాష్ట్రప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంపన్నుల అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. కానీ హైడ్రో బుల్డోజర్లు పేదల ఇళ్లపైకి వెళ్లడంతో అంతా తారుమారు అయింది. అక్కడ నుంచి హైడ్రా కూల్చివేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు ఎవరి ఇళ్లు కూలుస్తారో అని అంతా భయం భయంగా ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు