HYDRA: హైడ్రా మరో సంచలన కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్య, పాదచారులకు రక్షణ లేకుండా పోతుందనే ఆలోచలనలో హైడ్రా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల జనాలు రోడ్లపై నడుస్తున్నారు. దీని ద్వారా కొందరు ప్రమాదానికి గురవడంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతోంది. దీనిపై నిన్న ట్రాఫిక్ అదనపు కమిషనర్ కార్యాలయంలో అదనపు కమిషనర్ పీ విశ్వప్రసాద్‌తో కలిసి ఏవీ రంగనాథ్ ట్రాఫిక్ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కాగా అక్రమదారులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఈ కార్యాచరణను ప్రారంభించనున్నట్లు రంగనాథ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: గ్రూప్-1 పరీక్షలపై బిగ్ ట్విస్ట్!
ట్రాఫిక్ పోలీసులతో DRF...
పైలెట్ ప్రాజెక్ట్ కింద తొలుత హైదరాబాద్ నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో దీన్ని షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేసేలా కార్యాచరణ రూపొందించారు. కాగా డీఆర్‌ఎఫ్ సిబ్బందికి ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, టెలిఫోన్ వైర్లు, జీహెచ్‌ఎంసీ చెత్త డబ్బాలనూ ఆయా విభాగాలు తొలగించే బాధ్యతను తీసుకోనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: కేటీఆర్ పరువు నష్టం కేసు వాయిదా
144 నిలిచే ప్రాంతాలు..
ఇదిలా ఉంటే GHMC అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరంలో వరద నీరు నిలిచే ప్రాంతాలు 144 ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 65 ఏరియాలు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయని అధికారులు చెప్పారు. వీటితోపాటు వర్షపు నీరు నిలుస్తున్నట్టు కొత్తగా గుర్తించిన ప్రాంతాల్లో వీలైనంత త్వరగా వరద నీరు తొలగించేలా ఎక్కువ హార్స్‌పవర్‌తో కూడిన మోటార్లను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. పంప్ చేసిన నీరు సమీపంలోని నాలాలు, వరద నీటి డ్రైన్లలోకి వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!