FLASH: కేటీఆర్ పరువు నష్టం కేసు వాయిదా

TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసును సోమవారం విచారణ చేపడుతామని నాంపల్లి కోర్టు తెలిపింది. ఆరోజే కేటీఆర్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటామని పేర్కొంది.

New Update
KTR Konda Surekha

MLA KTR: బాధ్యత కలిగిన పదవిలో ఉండి మంత్రి కొండా సురేఖ తనపై నిరాధార ఆరోణలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. పిటిషన్ ను స్వీకరించిన కోర్టు ఈరోజు కేటీఆర్ నుంచి ఈ కేసుకు సంబంధించి స్టేట్‌మెంట్ తీసుకుంటామని చెప్పింది. కాగా ఈరోజు కోర్టుకు ముందు కేటీఆర్ హాజరుకి కావాల్సి ఉండగా.. ఈ కేసుపై విచారణ సోమవారినికి వాయిదా పడింది. అదేరోజు ఈ కేసులో కేటీఆర్ స్టేట్‌మెంట్ తీసుకుంటామని కోర్టు తెలిపింది.

ఇది కూడా చదవండి: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

సమంత విడాకులకు కేటీఆర్ కారణం!...

అక్కినేని నాగచైతన్య, సమంత (Samantha) విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు. ''ఎన్‌ కన్వెన్షన్‌ని (N Convention) కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరికి పంపించాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. ఇందుకు సమంత ఒప్పుకోకపోవడంతో నాగార్జున (Nagarjuna) ఇంటి నుంచి గెంటేశారు'' అని కొండా సురేఖ అన్నారు. కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు!

దీంతో కేటీఆర్‌ కోర్టును ఆశ్రయించారు. తనపై ఆమె చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఇదే కేసులో హిరో నాగార్జున కూడా కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కూడా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. నాగార్జున మేనకోడలు సుప్రియా కూడా ఈ కేసులో నాగార్జున తరఫున కోర్టుకు హాజరయ్యారు. సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కోర్టులో సాక్షి వాంగ్మూలం ఇచ్చారు. కాగా ఇప్పుడు కేటీఆర్ కు ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ వేసిన పిటిషన్ పై కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.

ఇది కూడా చదవండి: విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా?

Advertisment
Advertisment
తాజా కథనాలు