/rtv/media/media_files/WKgYvOUuFeBC4qAlLWuJ.jpg)
Hari Hara Veeramallu: ఇన్ని రోజులు రాజకీయాలతో తెగ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఎట్టకేలకు సినిమా సెట్స్ లో అడుగుపెట్టారు. మరో రెండు రోజుల్లో షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంతకీ పవన్ ఏ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు? వివరాల్లోకి వెళ్తే..
యాక్షన్ తో షురూ..
పవన్ కళ్యాణ్ ఇప్పటికే వరుస సినిమాలను కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలున్నాయి. వీటిలో మొదటగా 'హరి హర వీర మల్లు' కోసం డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 23 నుంచి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నట్లు తెలిపింది.
Also Read : 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగిల్.. లడ్డు గాని పెళ్లి పాట అదిరిందిగా
Our warrior outlaw's epic action saga #HariHaraVeeraMallu shoot resumes on 23rd September with a massive action sequence under the stunt direction of Hollywood legend Nick Powell, with POWERSTAR 🌟 @PawanKalyan garu.💥⚔️@AMRathnamOfl @amjothikrishna @MegaSuryaProd @HHVMFilm pic.twitter.com/T8A8Sp11uv
— Mega Surya Production (@MegaSuryaProd) September 20, 2024
హాలీవుడ్ లెజెండ్ నిక్ పావెల్ స్టంట్ డైరెక్షన్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నామని, ఇందులో పవన్ కళ్యాణ్ సైతం పాల్గొంటారని తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మూవీలోని పవన్ గెటప్ సంబంధించిన కొత్త ఫోటోను పోస్ట్ చేసింది. ఇప్పటిదాకా ఫుల్ టైం పాలిటిక్స్ తో బిజీ అయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన సినిమా షూటింగ్ లో జైన్ అవుతున్నారనే విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై సీనియర్ నిర్మాత AM రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.