Asaduddin Owaisi: జమిలీ ఎన్నికలకు మేం వ్యతిరేకం– అసదుద్దీన్ ఓవైసీ

దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. దీని మీద ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

Delhi: అసదుద్దీన్ ఇంటిపై దాడి
New Update

Asaduddin Owaisi: మాజీ రాఫ్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్ఓల ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. అయితే దీనిని తెలగాణలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన ఎంఐఎం తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పింది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్‌లో జమిఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విధానం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆయన అన్నారు.

రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని జమిలీ ఎననికలు అడ్డుకుంటాయని అసదుద్దీన్ అభిప్రాయ్ వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్‌ షాకు తప్ప.. ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని వ్యాఖ్​యానించారు. దీనిపై మున్సిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ అన్నారు. అసలు దేశానికి ఏకకాల ఎన్నికలు అవసరం లేదని తేల్చిచెప్పారు. తరచుగా ఆవర్తన ఎన్నికలు ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తాయని ఓవైసీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Also Read: CM Athishi: ఏపీలో ఒక స్కూల్‌లో టీచర్‌‌గా పనిచేసిన ఢిల్లీకి కాబోయే సీఎం అతిశీ..ఎక్కడో తెలుసా?

#asaduddin-owaisi #one-nation-one-election
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe