ఫార్ములా - ఈ రేస్ కేసులో నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు లేవు. ఫార్ములా - ఈ సీజన్ 10 నిర్వహణ, స్పాన్సర్ లేకపోవడంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో కుట్ర లేదు, అవినీతి అంతా కన్నా లేదు. ఈ నిర్ణయం నేను ఒక మంత్రిగా తీసుకున్నాను. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచడం కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఫార్ములా - ఈ మరో సీజన్ ను కూడా హైదరాబాద్ లో నిర్వహించడానికి తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం మాత్రమే అని చెప్పుకొచ్చారు. కావాలనే చేస్తున్నారు.. కానీ కొంతమంది కావాలని అసత్యాలను ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారు. కొన్ని వార్తా సంస్థలు పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి వారిని చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని కేటీఆర్ చెప్పారు. అయితే ఎవరు చేస్తున్నారు, ఏ వార్తా సంస్థలు లాంటి డీటెయిల్స్‌ను మాత్రం చెప్పలేదు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో KTR కు ఈడీ ఎంటర్ అయ్యింది. ఈ నెల 7న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణ కు రావాలని వీరికి ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. ఈడీ ఫెమా, మనీలాండరింగ్ కింద కేటీఆర్ కేసులు నమోదు చేసింది. FEOకు రూ.55 కోట్ల బదిలీ, ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. Also Read: ISRO: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్డౌన్