Telangana Revenue Department:
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైడ్రా పేరుతో చురువుల, కుంటల్లో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ భూములు, స్థలాల స్వాధీనాన్ని వేగవంతం చేసింది. దీని కోస్ ప్రత్యే ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. పోలీస్ బలగంతో హైడ్రాకు అధికారాలను కట్టబెట్టింది. అయితే స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నా...తరువాత ఏం చేస్తుంది అనేది తెలియడం లేదు. దీని విషయంలో ఆక్రమణల దారుల నుంచి డబ్బులు వసలు చేయడం ఒక్కటే మార్గంగా ఉంది. అదే దీని కోసం ఒక చట్టం ఉంటే..ఇంకా బావుంటుందని తెలంగాణ రెవిన్యుశాఖ ఆలోచన. దీని కోసం 2016 వరకు ఉన్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని తిరిగి ఉనరుద్ధరించాలని భావిస్తోంది. రాష్ట్రంలో మరింత పదునైన సెక్షన్లతో భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని తిరిగి తీసుకొచ్చి.. స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో రెవెన్యూశాఖ ఉన్నట్లు తెలిసింది.
Also Read: Hyderabad: అశోక్‌నర్‌లో హై టెన్షన్..రోడ్డెక్కిన గ్రూప్ 1 అభ్యర్థులు
ప్రత్యేక కోర్టు..
రాష్ట్రంలో చాలా ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలు జరిగాయని తేలింది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ నిర్వహించిన సర్వేలో పదేళ్ల కాలంలో ఓఆర్‌ఆర్ పరిధిలో 171 చెరువులు వివిధ స్థాయిల్లో కబ్జాల పాలైనట్లు స్పష్టం అయింది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకోవడంతోపాటు మరోమారు కబ్జాలు జరగకుండా. కబ్జాదారులకు కఠిన శిక్షలు పడేలా చేయాలంటే ప్రత్యేక కోర్టు అవసరమని భావిస్తున్నారు. కోర్టులు, చట్టాలు లేకపోవడం వల్లనే జిల్లా, హైకోర్టుల్లో సివిల్, క్రిమినల్ కేసులే పెద్దసంఖ్యలో ఉండగా భూ ఆక్రమణల కేసులు మరింత భారంగా మారుతున్నాయని అంటున్నారు.
Also Read: శబరిమలకు రోజుకు 10వేల స్పాట్ బుకింగ్స్..తగ్గిన వర్చువల్ బుకింగ్స్
ఇప్పుడు తదుపరి కార్యాచరణ కోసం 2016లో రద్దయిన భూ ఆక్రమణల నిరోధక చట్టం, స్పెషల్ కోర్టులపై వివరాలు తెలుసుకుంటోంది ప్రస్తుత తెలంగాణ రెవెన్యూశాఖ. పాత చట్టంలో ఏమి ఉన్నాయి..కొత్త చట్టంలో వేటిని చేర్చాలి లాంటి వాటి మీద కసరత్తులు చేస్తోంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో త్వరలో చర్చించి.. చట్టంపై ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించనున్నట్లు రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది.
Also Read: National: విమానాల్లో స్కై మార్షల్ పెంపు..పౌరవిమానయానశాఖ నిర్ణయం
Also Read: AP:ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..సీఎం చంద్రబాబు